ఆర్ ఆర్ ఆర్ .ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తచ్చేది రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.
కానీ ఒక రెండు తరాలు వెనక్కి వెళ్తే దీనికి అర్ధం మార్చేయచ్చు.తమదైన కామెడీ తో కడుపుబ్బా నవ్వించే పాత్రలు పోషించిన నటులు రేలంగి, రమణ రెడ్డి, రాజబాబు.
ఈ ముగ్గురు కలిసి చేసిన సినిమాలు చూడాలంటే పొట్ట చెక్కలవ్వాల్సిందే.తమ కామెడీ టైమింగ్ తో దాదాపు పాతికేళ్ల పాటు తన నటన విశ్వరూపం చూపించారు.
ముగ్గురు ముగ్గురే.ఒకరి తో ఒకరికి నేతల లోను, ఆహార్యం లోను సంబంధం ఉండదు.
కానీ వారిని ఆలా తెర పై చూడగానే నవ్వు ఆపుకోలేము.ఇప్పటి ప్రేక్షకులకు బ్రహ్మానందం మహా అయితే వెన్నెల కిషోర్ మాత్రమే కమెడియన్స్ గా కనిపిస్తారు.
ఈ ముగ్గురు మహా నటులలో రేలంగి ఇండస్ట్రీ కి త్వరగా వచ్చేసారు.అయన 1935 నుంచి నటనను ప్రారంభించి 1975 వరకు నటిస్తూనే ఉన్నారు.కన్ను మూసే వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్న తన 65 వ ఏటా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు.ఈ నలభై ఏళ్ళ సమయంలో రేలంగి దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు.
అయన కేవలం నటుడిగా మాత్రమే కాదు సింగర్ కూడా పని చేసారు.పద్మశ్రీ అవార్డు కూడా పొందారు.
అయన వారసులు ఎవరు సినిమాల్లో లేకపోవడం గమనార్హం.
ఇక రేలంగి పుట్టిన తర్వాత ఒక పదేళ్లకు పుట్టాడు కమెడియన్ రమణ రెడ్డి.అయన కాస్త లేట్ గా సినిమాల్లో ప్రవేశించాడు.1950 లలో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఈయన కూడా దాదాపు గా 200 లకు పైగా సినిమాల్లో నటించాడు.ఇక బక్క పలచగా ఉంటూ సూపర్బ్ టైమింగ్ తో అయన వేసే పంచులు మహా అద్భుతంగా పండేవి.ఇక ఈయనకు సైతం వారసులు లేకపోయినా నిర్మాత టి సుబ్బిరామి రెడ్డి మాత్రం రమణ రెడ్డి కి దగ్గర బంధువు కావడం గమర్హం.
ఇక రేలంగి, రమణ రెడ్డి ల తర్వాత అంతటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న నటుడు రాజ బాబు.కానీ వీరంతా సాఫ్ట్ గా రాజబాబు ఉండేవాడు కాదు.తనకు నచ్చకపోతే ముఖ్యమంత్రికి కూడా ఎదిరించే నైజం అయన సొంతం.కేవలం 45 ఏళ్ళు మాత్రమే జీవించిన రాజబాబు 60 లలో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 1981 లో చివరగా నటించాడు.
గొంతు కాన్సర్ తో ఆ తర్వాత రెండేళ్లకే అయన ప్రాణం వదిలాడు.