మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు.ఈ ఉపఎన్నిక నిర్వహణపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈనెల 10న ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.టీఆర్ఎస్ కు ఎన్నికల అధికారులు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు.
ఉపఎన్నిక నేపథ్యంలో అక్రమాలకు పాల్పడ్డ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.







