అధిక బరువు( Over Weight ) అనేది ఇటీవల రోజుల్లో ఎంతోమందికి అది పెద్ద శత్రువు గా మారింది.అధిక బరువు శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది.
అందుకే బరువును తగ్గించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? బరువు తగ్గడానికి( Weight Loss ) కష్టపడుతున్నారా.? కఠినమైన డైట్ ను ఫాలో అవుతున్నారా.? రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తున్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ లడ్డూ మీ డైట్ లో ఉండాల్సిందే.
సాధారణంగా సాయంత్రం వేళ లేక నైట్ నిద్రించే ముందు విపరీతమైన ఆకలి వేస్తుంటుంది.ఎంత డైట్ చేసేవారు అయినా సరే ఆ సమయంలో ఫుడ్ క్రేవింగ్స్ వల్ల చిరుతిండ్లపై మక్కువ చూపుతుంటారు.
ఇవే కొంపముంచుతాయి.ఎంత కష్టపడినా సరే వీటివల్ల బరువు నామ మాత్రమైన తగ్గరు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ లడ్డూ( Protein Laddu ) కనుక తీసుకుంటే మీ ఫుడ్ క్రేవింగ్స్ పరార్ అయిపోతాయి.ఆకలి దూరం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజలు,( Flax Seeds ) ఒక కప్పు నువ్వులు,( Sesame ) ఒక కప్పు బాదం వేసుకుని వేయించి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో బాదం పప్పు, అవిసె గింజలు మరియు నువ్వులను వేసుకుని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు బెల్లం తురుము కొద్దిగా వాటర్ వేసుకుని మెల్ట్ చేయాలి.
మెల్ట్ అయిన బెల్లంను ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించి.అప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ తో పాటు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా తిప్పి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన మిశ్రమాన్ని కాస్త చల్లారిన తర్వాత లడ్డూల మాదిరిగా చుట్టుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు చిరుతిండ్లపై మనసు మళ్లినప్పుడు వీటిని తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.ఈ లడ్డు శరీరాన్ని క్షణాల్లో శక్తివంతంగా మారుస్తుంది.అతి ఆకలని అణచివేస్తుంది.మెటబాలిజం రేటును పెంచుతుంది.దీంతో క్యాలరీలు కరిగే వేగం పెరిగి మరింత త్వరగా బరువు తగ్గుతారు.
పైగా ఈ ప్రోటీన్ లడ్డూను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.ఎముకలు దృఢంగా మారతాయి.
కంటి చూపు సైతం రెట్టింపు అవుతుంది.