సినీ పరిశ్రమకు ప్రభుత్వం భరోసా..ఆన్ లైన్ టిక్కెట్లకు ఓకే.. మంత్రి పేర్ని నాని

రాష్ట్రంలో త్వరలో ఆన్ లైన్ బుకింగ్ విధానంలో సినిమా టిక్కెట్ల విక్రయాన్ని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వెల్లడించారు.సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానం అనేది 2002వ సంవత్సరం నుండి అమలు నోచుకోకుండా ఉన్న అంశమని పేర్కొన్నారు.

 Ap Minister Perni Nani Comments On Tollywood Movie Industry And Online Tickets,-TeluguStop.com

ప్రభుత్వం దీనిపై వివిధ కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పటికే విస్తృతంగా అధ్యయనం చేయడం జరుగుతుందని చెప్పారు.దానిలో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు అనగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, తదితర స్టేక్ హోల్డర్లతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పారు.

ఆన్ లైన్ విక్రయంపై అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు సినిమా రంగానికి సంబంధించి అనేక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారని వాటన్నిటినీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రిని నాని పేర్కొన్నారు.

ఈ విషయంపై ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ప్రేక్షకులందరికీ పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ల ధరల ప్రకారం వినోదాన్ని అందించడం ఇదే ప్రభుత్వ ఉద్దేశం అని ఆ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి వెంకటరామయ్య (నాని) మీడియాకు వివరించారు.సినీ పెద్దల తో అనేక విషయాలు చర్చించామని సమస్యలన్నీ నమోదు చేసుకున్నామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

మరిన్ని విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి చెప్పమని టిక్కెట్ల ఆన్ లైన్ లో అమ్మాలనే కేంద్రం చర్యలు స్టడీ చేశామన్నారు.

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమస్యలు గుర్తించామన్నారు.ఆన్ లైన్ విధానంలో టికెట్ విక్రయాలకు అంతా ఆమోదం తెలిపారు అన్నారు.

సగటు సినీ ప్రేక్షకులకు టిక్కెట్ ధరలు అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయమని మంత్రి చెప్పారు.ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రమే ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ల విక్రయాలను చేపడతాం త్వరలోనే ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదం అందుతుంది.

Telugu Ap Cm Jagan, Ap Perni Nani, Theaters, Tollywood, Tickets, Kalyan, Teluguc

చట్టాలకు లోబడే ప్రభుత్వం నడుచుకుంటుంది.బెనిఫిట్ షోలు గురించి ఇవాళ ఎవరూ అడగలేదు.ఎవరు విజ్ఞప్తి చేసిన సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారని పేర్ని నాని అన్నారు.అన్ని థియేటర్లలో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సినీ నిర్మాతలు దిల్ రాజు, సి.కల్యాణ్ ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై సినీ పెద్దలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.సమావేశం ఫలప్రదంగా ముగిసిందని భేటీలో పాల్గొన్న నిర్మాతలు తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు విజయచందర్, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ మరియు రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ టి.విజయ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సీఈఓ వాసుదేవ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు చెందిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు తదితర ప్రతినిధులు సి.కళ్యాణ్, దిల్ రాజు, జి.ఇది శేషగిరిరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Telugu Ap Cm Jagan, Ap Perni Nani, Theaters, Tollywood, Tickets, Kalyan, Teluguc

సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి భరోసా లభించిందని స్పష్టం చేశారు.సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలిచింది అన్నారు.

ఆన్ లైన్ టికెటింగ్ కావాలనే తము అడిగినట్లు వెల్లడించారు.ప్రభుత్వ నిర్ణయంతో సంతోషంగా ఉందన్నారు.

ఆన్ లైన్ టికెటింగ్ గతంలో ఆప్షన్ గా ఉండేదని మరో నిర్మాత ఆదిశేషగిరిరావు అన్నారు.థియేటర్ యజమానులు సమస్యలతో పాటు సినీ పరిశ్రమకు మేలు చేసేందుకు సహకరిస్తామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

నిర్మాత డి ఎల్ వి ప్రసాద్ మాట్లాడుతూ బుక్ మై షో తరహాలోనే ప్రజలు ఆన్ లైన్ లోనే టిక్కెట్లు కోంటారని వెల్లడించారు.రాష్ట్రంలో సినిమా షూటింగులు పెరిగాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube