చుండ్రుతో బాగా విసిగిపోయారా? ఈ ఆయిల్ ను వాడితే వారం రోజుల్లో మాయమవుతుంది!

చుండ్రు.అత్యంత సాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.స్త్రీలే కాదు పురుషులు కూడా చుండ్రుతో సతమతం అవుతుంటారు.వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం తదితర కారణాల వల్ల చుండ్రు ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

 This Is A Powerful Oil That Removes Dandruff Quickly , Powerful Oil, Dandruff, D-TeluguStop.com

పైగా ఒక్కోసారి ఎన్ని చిట్కాలు ప్రయత్నించిన, ఖరీదైన షాంపూను ఉపయోగించిన ఫలితం ఉండదు.దీంతో చుండ్రుతో బాగా విసిగిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్‌ ఆయిల్ ను కనుక వాడితే వారం రోజుల్లోనే చుండ్రు మాయమవుతుంది.మరి ఇంకెందుకు లేటు ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల వేపాకు, నాలుగు రెబ్బ‌ల‌ కరివేపాకు వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి.ఇలా వేయించిన కరివేపాకు వేపాకును మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.ఆపై గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకు కరివేపాకు పొడి వేసుకోవాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Latest, Powerful Oil-Telugu H

అలాగే ఐదు నుంచి ఎనిమిది లవంగాలు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని చిన్న మంటపై కనీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత స్కాల్ప్ కు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Latest, Powerful Oil-Telugu H

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని మ‌రుస‌టి రోజు మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి.మూడు రోజులకు ఒకసారి ఈ ఆయిల్ ను వాడాలి.తద్వారా వారం రోజుల్లోనే చుండ్రు మొత్తం మాయం అవుతుంది.

తరచూ ఈ ఆయిల్ ని యూస్ చేస్తే మళ్లీ మళ్లీ చుండ్రు దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.స్కాల్ప్ శుభ్రంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలు ఉన్న దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube