డ్రాగ‌న్ ఫ్రూట్‌ను ఇలా తీసుకుంటే గుండె పోటు నుంచి క్యాన్స‌ర్ వ‌ర‌కు ఎన్నో బెనిఫిట్స్‌!

డ్రాగ‌న్ ఫ్రూట్‌.దీని గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 If You Take Dragon Fruit Like This, There Are Many Benefits From Heart Attack To-TeluguStop.com

మెక్సికో, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో అత్య‌ధికంగా పండించే డ్రాగ‌న్ ఫ్రూట్స్ చూసేందుకు అందంగానే కాదు ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు కూడా క‌లిగి ఉంటాయి.అవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే చాలా మంది డ్రాగ‌న్ ఫ్రూట్స్‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.కార‌ణం దాని రుచే.

కివి మ‌రియు లెమ‌న్ మిక్స్డ్ రుచిని క‌లిగి ఉండే డ్రాగ‌న్ ఫ్రూట్‌ను ఎవైడ్ చేస్తే ఎన్నో ఆరోగ్య లాభాల‌ను మిస్ అయిన‌ట్లే.

అయితే డ్రాగ‌న్ ఫ్రూట్‌ను డైరెక్ట్‌గా కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా తీసుకుంటే.

రుచితో పాటు బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం డ్రాగ‌న్ ఫ్రూట్‌ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా చిన్న సైజ్ డ్రాగ‌న్ ఫ్రూట్‌ను తీసుకుని పై తొక్క‌ను తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

Telugu Cancer, Dragon Fruit, Dragonfruit, Benefits, Tips, Heart Attack, Latest-L

అలాగే ఒక అర‌టి పండును కూడా తీసుకుని పీల్ తీసేసి స్లైసెస్‌గా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అర‌టి పండు ముక్క‌లు, డ్రాగ‌న్ పండు ముక్క‌ల‌ను నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.ఆపై బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న అర‌టి-డ్రాగ‌న్ పండు ముక్క‌లు, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన పాలు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వ‌న్ టేబుల్ స్పూన్ వేయించిన పుచ్చ గింజ‌లు, పొద్దు తిరుగుడు గింజ‌లు, అవిసె గింజ‌లు మిక్స్ చేసి మార్నింగ్ టైమ్‌లో తినాలి.ఈ విధంగా డ్రాగ‌న్ ఫ్రూట్‌ను తీసుకుంటే గుండె పోటు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంట‌యి.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది.

ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.మ‌రియు చ‌ర్మం నిగారింపుగా కూడా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube