యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )ప్రస్తుతం నటిస్తున్న వార్2 సినిమాపై ( War2 )అంచనాలు మామూలుగా లేవు.ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు నెల 14 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతుండగా రికార్డు స్థాయి స్క్రీన్ లలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
ఈ సినిమాలో తారక్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.తారక్ ఈ సినిమాలో యుగంధర్ అనే పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
అతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల కానుందని ఈ టీజర్ ఒకింత ప్రత్యేకంగా ఉండనుందని సమాచారం అందుతుంది.వార్2 సినిమా కోసం తారక్ ఏకంగా 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ కూడా ఉంటుందని భోగట్టా.త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను మించేలా ఈ పాట ఉండబోతుందని తెలుస్తోంది.వార్2 సినిమా కోసం ఖర్చు విషయంలో నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ గత సినిమా దేవర బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ సినిమా ఫెయిల్ అయింది.ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి. దేవర సినిమాను( Devara movie ) రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా తెరకెక్కించి ఉంటే మాత్రం ఈ సినిమా ఫలితం మరింత బెటర్ గా ఉండేది.

వార్ 2 సినిమాలో తారక్ కి జోడిగా నటించే బ్యూటీ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.వార్ 2 కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.తారక్ స్టైలిష్ లుక్ లో దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.