సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమా మంచి హిట్ అవుతుందన్న నమ్మకంతోనే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి సినిమాలు చేస్తారు.అయితే ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అన్నది మాత్రం ఎవరి చేతుల్లోనూ లేదు.
ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ కావాలన్న ఉద్దేశంతోనే చేస్తుంటారు.కొన్నిసార్లు మంచి సక్సెస్ అవుతాయి అనుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి.
ఇక ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన హరీష్ శంకర్( Harish Shankar ) బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే దిల్ రాజు( Dil Raju ) నిర్మాణంలో హరీష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ( NTR )హీరోగా ప్రేక్షకుల ముందుకు రామయ్య వస్తావయ్య (Ramayya Vadtavayya) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో శృతిహాసన్ ( Shruthi Hassan )సమంత( Samantha ) హీరోయిన్లుగా నటించారు.
ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ సొంతం చేసుకుంది.

తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి కానీ ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత నేను హరీష్ ఎన్టీఆర్ ముగ్గురం కలిసి దాదాపు 6 గంటల పాటు ఈ సినిమా గురించి చర్చించుకున్నాము ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయిందనే విషయాలు గురించి మాట్లాడుకున్నామని తెలిపారు.ఫ్లాప్ సినిమా అని తెలిసిన తర్వాత నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్నది మేము బయటకు వచ్చి మా సినిమా పోయిందని రెండో రోజే బయటకు వచ్చి చెప్పలేము ఇలాంటి డిస్కషన్ చేయడం వల్ల అలాంటి తప్పులు మరోసారి జరగకుండా ఉంటాయి.
ఇక సినిమా పోయిన ప్రమోట్ చేయడం అనేది సర్వసాధారణం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకూడదు కనుక సినిమా ఫ్లాప్ అయిన ప్రమోట్ చేస్తామని అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అంటూ దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.