నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ), బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అఖండ ( Akhanda ) సినిమా బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది.ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస హ్యాట్రిక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2( Akhanda 2 )సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ యంగ్ హీరో ఆది పినిశెట్టి( Aadi Pinisetty ) నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.ఇదివరకే బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈ క్రమంలోనే బోయపాటి మరోసారి బాలయ్యకు విలన్ గా ఆది పినిశెట్టిని ఎంపిక చేశారు అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆది పినిశెట్టి అఖండ 2 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.అఖండ 2 అప్పుడే ఏం మాట్లాడలేం.అయినప్పటికీ ఒక షెడ్యూల్ అయ్యింది.చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది.బోయపాటి గారు- బాలయ్య గారి కాంబినేషన్ గురించి మనకందరికీ తెలుసు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది.
అందులో నేను కూడా భాగం అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఫస్ట్ షెడ్యూల్ చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అంటూ ఆది పినిశెట్టి అఖండ2 గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఫస్ట్ హాఫ్ కే.ప్రేక్షకులు టికెట్ కి పెట్టిన మొత్తానికి సంతృప్తి లభిస్తుంది అంటూ ఇటీవల ఓ వేడుకలో సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ సినిమా గురించి చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేశారు.