తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేని హీరోలలో సందీప్ కిషన్ ( Sandeep Kishan )ఒకరు.స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్లో నటించకపోవడం వల్ల కూడా సందీప్ కిషన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేయలేదని ఫ్యాన్స్ భావిస్తారు.
సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్న సందీప్ కిషన్ ఈ నెల 26 వ తేదీన మజాకా సినిమాతో( Mazaka ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఈ సినిమా ట్రైలర్లో సందీప్ కిషన్ కు పీపుల్ స్టార్ ( People star )అనే ట్యాగ్ ఇవ్వడం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నిర్మాత అనిల్ సుంకర( Producer Anil Sunkara ) పీపుల్ స్టార్ ట్యాగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రేక్షకులతో మనస్పూర్తిగా మాట్లాడే హీరోలలో, ఫ్యాన్స్ ను సైతం ఇంటికి ఆహ్వానించే హీరోలలో సందీప్ కిషన్ ఒకరు అని అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.

సందీప్ కిషన్ 30వ ప్రాజెక్ట్ మజాకా కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.సందీప్ కిషన్ కు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలనుకుని పీపుల్ స్టార్ అనేది ఉత్తమం అనిపించిందని అనిల్ సుంకర తెలిపారు.అలా ఎందుకు పెట్టానో భవిష్యత్తులో మీకూ అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ నారాయణమూర్తి గారికి పీపుల్ స్టార్ అనే ట్యాగ్ ఉందని నాకు తెలియదని చెప్పుకొచ్చారు.