సాధారణంగా చాలా మంది సిల్కీ హెయిర్ ను తెగ లైక్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే సిల్కీ హెయిర్‌ను పొందడం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు.
రకరకాల హెయిర్ ప్రోడెక్ట్స్ ను వాడుతుంటారు.కానీ, సహజంగా కూడా సిల్కీ హెయిర్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ట్రై చేస్తే గనుక న్యాచురల్‌గానే సిల్కీ హెయిర్ మీసొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ఆపిల్ సైడర్ వెనిగర్..జుట్టును సిల్కీగా మార్చడంలో సూపర్‌గా సహాయపడుతుంది.మూడు గ్లాసుల వాటర్‌ను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి మిక్స్ చేయాలి.
షాంపూ చేసుకున్నాక ఈ వాటర్‌ను జుట్టు మొత్తం తడిచేలా తలపై పోసుకోవాలి.పది నిమిషాల అనంతరం వాటర్‌తో హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో అర కప్పు కొబ్బరి పాలు, వన్ టేబుల్ స్సూన్ విటమిన్ ఇ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా కలపాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అర గంట పాటు షవర్ క్యాప్ పెట్టుకోవాలి.ఆపై మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మీ జుట్టు సహజంగానే సిల్కీగా మారుతుంది.

ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి గంట పాటు షవర్ క్యాప్ పెట్టుకోవాలి.ఆపై హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేసినా మంచి ఫలితం ఉంటుంది.