గ్రూపు రాజకీయాలు అనేవి పార్టీని ఎంతగా దెబ్బతీస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఒక గ్రూపు మరో గ్రూపు పై పైచేయి సాధించే క్రమంలో సొంత పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చుతాయి.
ఒక పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎంత ముదిరితే అంతగా ఆ పార్టీ నీ దెబ్బ తీయడం ఖాయం .ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసిపి సైతం ఇదే తరహాలో ఈ గ్రూపు రాజకీయాలు ఎదుర్కొంటోంది.పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ 2,3 గ్రూపులో ఉండడం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేయడం,.దీంతో క్యాడర్ గందరగోళానికి గురి కావడం వంటివి పరిపాటిగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈ తరహా గ్రూపు రాజకీయాలు ముదిరిపోయాయి.ముఖ్యంగా నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కి ఏ మాత్రం పోసగడం లేదు.
కొద్ది రోజుల క్రితం నరసాపురం ను జిల్లా కేంద్రంగా చేయాలి అంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు నిరసనకు దిగారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ను గెలిపించి తప్పు చేశానని ఆయన చెప్పుతో కొట్టుకుని నిరసన తెలియజేయడం సంచలనంగా మారింది.
అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు మరింతగా పెరిగిపోయాయి.తాజాగా సుబ్బరాయుడు కి ఎమ్మెల్యే తో సమానంగా ఉన్న గన్ మెన్ లను తొలగించడంతో సుబ్బారాయుడు పై ప్రసాదరాజు వర్గం పై చేయి సాధించినట్లు అయ్యింది.

వైసీపీ అధిష్టానం అండ దండలు కూడా ప్రసాద్ రాజుకి ఉన్నట్టుగా తేలడం తో, ఇప్పుడు సుబ్బరాయుడు ఆలోచనలో పడ్డారట.దీంతో ఆయన మళ్లీ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.కాపు సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడు ఇప్పటికే వివిధ పార్టీలు మారారు.వైసీపీలో గత కొంతకాలంగా ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో పాటు, ఇప్పుడు గన్ మెన్ లను సైతం తొలగించడంతో పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారట.