భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో 2025 సంవత్సరానికి కీలకమైన మార్పులను తీసుకువచ్చింది. రైలు టిక్కెట్లు బుక్ ( Book train tickets )చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇకపై కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
రైలు సేవలను మరింత సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి ఈ మార్పులు తీసుకువచ్చినట్లు IRCTC( IRCTC ) ప్రకటించింది.ఇప్పటివరకు ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే తత్కాల్ టికెట్ బుకింగ్ ఇకపై ఉదయం 11:00 గంటలకు మొదలు కానుంది.ప్రయాణికులు ఈ కొత్త సమయాన్ని గమనించి, తమ బుకింగ్‌కు ముందుగానే సన్నద్ధం కావాలి.తత్కాల్ టిక్కెట్ల కోసం AC, నాన్-AC కోచ్‌లకు ప్రత్యేక కోటాలను నిర్ణయించారు.దీని ద్వారా ప్రయాణికులు తాము కోరుకున్న సీటును పొందే అవకాశాలు మెరుగుపడతాయి.

మరోవైపు IRCTC డైనమిక్ ధర ( IRCTC Dynamic Pricing )విధానాన్ని అమలు చేసింది.టికెట్ డిమాండ్, లభ్యతను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండేలా చర్యలు చేపట్టనుంది.ఈ విధానం టిక్కెట్లలో పారదర్శకతను పెంచనుంది.
తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు ( Aadhaar card )తప్పనిసరి చేసింది.నకిలీ టిక్కెట్ల బుకింగ్‌ను నివారించేందుకు ఈ కొత్త నిబంధన అమలు చేయబడింది.
ఇప్పటివరకు తత్కాల్ టిక్కెట్ రద్దుపై కఠిన నిబంధనలు ఉండేవి.అయితే, కొత్త మార్పుల ప్రకారం 24 గంటల ముందుగా టికెట్ రద్దు చేసిన ప్రయాణికులకు అధిక వాపసు లభించేలా IRCTC మార్పులు చేసింది.
ఈ కొత్త నిబంధనలతో తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం అవుతుందని, ప్రయాణికులు ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణ ప్రణాళికను సజావుగా చేసుకోవాలని IRCTC సూచించింది.కాబట్టి రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి టికెట్ బుక్ చేసుకోగలరు.