బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు.ఇటీవల ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
దేవర సినిమాలో తంగం కేరక్టర్ చూడ్డానికి చిన్నదే.కానీ హీరోయిన్ జాన్వీకి మంచి పేరే వచ్చింది.
సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో లాంఛింగ్ వెంచర్ కేక అంటూ అందరూ ప్రశంసించేశారు.దేవర పార్ట్ 2 కోసం జాన్వీ కపూర్ తో పాటు అందరూ వెయిటింగ్.
అలా ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే ఆర్సీ 16 పనులతో బిజీ అయిపోయారు జాన్వీ కపూర్.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాతో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.నాని, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టులో జాన్వీని హీరోయిన్ గా అనుకుంటున్నట్టు ఆ మధ్య వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే అందులో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.ప్రస్తుతానికి తెలుగులో గ్లోబల్ స్టార్ మూవీ మాత్రమే ప్రొడక్షన్ లో ఉంది శ్రీదేవి కూతురు.చెర్రీ సినిమా కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ సెట్స్ కి వెళ్తారట జాన్వీ.

అట్లీ డైరక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యారన్నది లేటెస్ట్ న్యూస్.అయితే నార్త్ హీరోయిన్స్ ఇలా కనిపించి, అలా వెళ్లి పోతుంటే మా జాన్వీ పాప మాత్రం సౌత్ లో పక్కాగా సెటిల్ కావాలని ఫిక్స్ అయిపోయారంటూ హ్యాపీగా ఉన్నారు అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి అభిమానులు.ప్రస్తుతం జాన్వీ జోష్ చూస్తుంటే తల్లి బాటలో పయనిస్తూ తెలుగులో ఫుల్ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది.
మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో జాన్వికి అనుకున్న రేంజ్ లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి మరి.