ఒక ఊరికి వెళ్లితే ప్రతి వీధిలోనూ ఎవరో కెమెరాలతో, లేదంటే ఫోన్లతో వీడియోలు షూట్ చేస్తూ కనిపిస్తే? ఊహించుకోవడం కష్టమే కదా! కానీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తులసి గ్రామం పూర్తిగా మారిపోయింది.అక్కడ ప్రతి ఇంట్లో ఓ యూట్యూబ్ స్టూడియో, ఎడిటింగ్ రూమ్ ( YouTube studio, editing room )ఉండటం ఇప్పుడు సాధారణంగా మారింది.
అయితే, వారు యూట్యూబ్‌కు బానిసలు కాలేదు… ఉపాధిగా మార్చుకుని, తమ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ( Chhattisgarh )రాష్ట్రం సాధారణంగా వెనుకబడినదే.
కానీ, ఒక చిన్న గ్రామమైన తులసిలో యూట్యూబ్ సంచలనంగా మారింది.ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇద్దరు యువకులు తమ ఊరి గురించి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ( YouTube channel )ప్రారంభించారు.
మొదటగా గ్రామంలోని అనేక ఆసక్తికరమైన విషయాలను తమ వీడియోల ద్వారా చూపించారు.ఊహించని విధంగా వీటి వ్యూస్ పెరిగాయి.
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాయి.

దీంతో, గ్రామంలోని ఇతర యువకులు కూడా యూట్యూబ్‌ను ఓ అవకాశంగా గుర్తించి తమదైన శైలిలో కొత్త కంటెంట్‌ను రూపొందించడం ప్రారంభించారు.కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, విభిన్న రంగాల్లో తమ టాలెంట్‌ను చూపిస్తూ విభిన్న ఛానళ్లను క్రియేట్ చేశారు.తులసి గ్రామంలో మొదటగా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించిన యువకులు ఇతరులను ప్రోత్సహించడం ప్రారంభించారు.
యువతతో పాటు, మహిళలు కూడా ముందుకు వచ్చి వీడియోలు చేయడం మొదలుపెట్టారు.వీరి కంటెంట్ కూడా వైరల్ కావడంతో, ప్రతీ ఇంట్లో యూట్యూబ్ ప్లే బటన్ (సిల్వర్, గోల్డ్) కనిపించడం సాధారణమైంది.

ఈ ఊర్లో యూట్యూబ్ వీడియోలు తీసేవారు ఎవరూ బయటకు వెళ్లరు.వీలైనంత వరకు గ్రామంలోనే కంటెంట్ రూపొందించి, ఊరిని మరింత పాపులర్ చేస్తున్నారు.ఈ డిజిటల్ విప్లవాన్ని గుర్తించిన ప్రభుత్వం కూడా గ్రామంలో ఓ ప్రత్యేక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసింది.కొత్తగా యూట్యూబ్ రంగంలోకి వచ్చే వారందరికీ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
తులసి గ్రామం యువతకు ఉద్యోగాల్లేని పరిస్థితి లేకుండా సృజనాత్మకంగా ఉండేలా మారింది.ఇప్పుడు ఈ ఊరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.







