కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడం ముఖ్యం కాదు హిట్టు కొట్టడమే ముఖ్యం అనేది ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలు పాటిస్తున్న సక్సెస్ మంత్రం.ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తుంటే చిన్న సినిమాలు విజయం సాధిస్తున్నాయి.
అందుకు ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ మన తెలుగు హీరోలు విజయం పొందడం కోసం తమతో గతంలో నటించి హిట్టు కొట్టిన హీరోయిన్స్ నే ఎంచుకుంటూ తమ తాజా సినిమాలను ప్రకటించేస్తున్నారు.ఆ లిస్టులో ఉన్న హీరో హీరోయిన్స్ ఎవరు హిట్ అయినా సినిమాలు ఏంటి ? అలాగే రాబోతున్న సినిమాల విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న
గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ లో మొట్టమొదటిసారి విజయ్ ( Vijay Devarakonda ) మరియు రష్మిక( Rashmika ) కలిసి నటించారు ఈ సినిమా విజయం సాధించిన తర్వాత మళ్ళి ఈ జోడీ జత కట్టారు.ఇప్పుడు విజయ్ తన కొత్త సినిమాలో శ్రీ లీల తో నటించాల్సి ఉండగా ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆస్థానంలో మరో మారు రష్మిక వచ్చి చేరింది.

నాగ చైతన్య – సాయి పల్లవి
నాగచైతన్య( Naga Chaitanya ) మరియు సాయి పల్లవి( Sai Pallavi ) కాంబినేషన్లో వచ్చిన ఫిదా సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇప్పుడు మరో మారు అల్లు అరవింద్ నిర్మాణంలో వీరిద్దరూ కలిసి కొత్త చిత్రంలో నటిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ – సంయుక్త మీనన్
కళ్యాణ్ రామ్( Kalyan Ram ) గతంలో సంయుక్త మీనన్ తో ( Samyuktha Menon ) బింబిసారా సినిమాలో కలిసింది నటించారు.ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇప్పుడు కళ్యాణ్ రామ్ తన కొత్త ప్రాజెక్ట్ డెవిల్ కోసం సంయుక్త మీనన్ ని తీసుకున్నట్టుగా పక్కా సమాచారం ఉంది.

నితిన్ – రష్మిక మందన
గతంలో భీష్మ సినిమాలో నితిన్ మరియు రష్మిక కలిసి నటించి అదరగొట్టారు.ఇప్పుడు వెంకీ కుడుములు కొత్త సినిమాలో రష్మిక మరో మారు నితిన్ తో జోడి కడుతోంది.