టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న( Tamannaah ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇకపోతే తమన్నా తాజాగా నటించిన చిత్రం ఓదెల 2( Odela 2 ).
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది.ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్నారు.
హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ, యువ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ ( Ashok Teja )దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి.మధు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.

ఇది ఇలా ఉంటే ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలో ( Maha Kumbha Mela )త్రివేణి సంగమం వద్ద నాగ సాధువుల సమక్షంలో ఓదెల 2 టీజర్ ను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.సంపత్ నంది ( Sampath Nandi )విజన్ ని దర్శకుడు అశోక్ తేజ అద్భుతంగా తెర పైకి తీసుకువచ్చాడు.సంపత్ నందిగారితో నాలుగు సినిమాలు సైన్ చేశాను.
కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది అని తెలిపారు.సంపత్ నంది మాట్లాడుతూ.
ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత తమన్నా మాంసాహారం తినడాన్ని మానేశారు.

అమ్మోరు మూవీలో సౌందర్య గారిని అరుంధతి మూవీలో అనుష్క గారిని ఎంత ఆరాధించామో అలా ఈ సినిమాతో తమన్నా కూడా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను అని అన్నారు.తమన్నా కూడా స్పందిస్తూ జీవితంలో మహా కుంభమేళా ఒక్కసారి మాత్రమే వస్తుంది.అలాగే ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం కూడా ఒక్కసారి వస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా తమన్నా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.