మంచు విష్ణు (Manchu Vishnu)త్వరలోనే తన డ్రీం ప్రాజెక్ట్ అయిన కన్నప్ప(Kannappa) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఏప్రిల్ నెలలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
ఇక ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలు అందరూ కూడా భాగమయ్యారు.ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో విష్ణు హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్(Preethi Mukundan) కథానాయికగా నటిస్తున్నారు.తాజాగా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సినిమా గురించి తన ఫ్యామిలీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం ఇస్తానంటే ఎన్ని జన్మలెత్తిన నేను మోహన్ బాబు(Mohan Babu) గారికి కొడుకు గానే పుట్టాలని కోరుకుంటానని విష్ణు తెలిపారు.మా కుటుంబంలోని కలహాలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది.నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.
నేను మా అమ్మానాన్నతో ఉండాలి.నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని కోరుకుంటాను అంటూ తెలిపారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రభాస్ పెళ్లి(Wedding) గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో ప్రభాస్ పెళ్లి గురించి ఆయన చేసుకోబోయే అమ్మాయి గురించి నాకు ఎలాంటి విషయాలు కూడా తెలియవని క్లారిటీ ఇచ్చారు.

ఇక కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ చిత్రాన్ని స్వయంగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు.ఇలా విష్ణు కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా బడ్జెట్ పై విష్ణు మాట్లాడుతూ… కన్నప్ప సినిమా బడ్జెట్ విషయం తలుచుకుంటే నాకు ఇప్పటికీ గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయని తెలిపారు.సినిమాపై నమ్మకంగా ఉన్నా.
అయినా సక్సెస్- ఫెయిల్యూర్ రెండూ మోసగాళ్లే… ఎవరూ మనతో శాశ్వతంగా ఉండరు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి
.