టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మజాకా.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.
త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా మజాకా సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాన్ని బయట పెట్టాడు హీరో సందీప్ కిషన్.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఫై ఒక డైలాగ్ పెట్టారు.
అయితే ఆ డైలాగ్ ను సెన్సార్ అధికారులు కట్ చేశారట.ఇంతకీ ఎందుకు కట్ చేసారు అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.
మజాకా సినిమాలో పవన్ ఖుషి మూవీ రిఫరెన్స్ ఉందట.

ఆ సినిమాలో భూమిక నడుమును చూసీ చూడనట్టు చూస్తుంటాడు పవన్ కల్యాణ్.అదే సీన్ ను మజాకాలో రీ క్రియేట్ చేశారట.పవన్ కల్యాణ్ స్థానంలో రావు రమేష్ ను, భూమిక స్థానంలో అన్షును పెట్టి తీశారట.
నడుము చూసి రావు రమేష్ షేక్ అయిపోతుంటే ఏమైంది నాన్నా అని అడుగుతాడు హీరో.ఇప్పటి పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో ఇలాంటివి చూసి ఎంత కంగారు పడ్డారో ఇప్పుడు నాకు అర్థమౌతోంది అనే డైలాగ్ చెబుతారు రావు రమేష్.
అయితే ఈ డైలాగ్ ను సెన్సార్ లో కట్ చేశారు.సినిమాలో అది తనకు ఇష్టమైన డైలాగ్ అంటున్నాడు హీరో సందీప్ కిషన్.ఈ సినిమాలో హీరోతో సమానమైన పాత్ర కూడా పోషించారు రావు రమేష్.

సినిమాలో ఆయన కూడా హీరోనే అని స్వయంగా సందీప్ కిషన్ ప్రకటించారు.ఇంత ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించిన రావు రమేశ్, మజాకా సినిమా ప్రచారంలో మాత్రం కనిపించడం లేదు.కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాలు దాదాపుగా పది రోజులుగా జరుగుతూనే ఉన్నాయి.
ప్రచార కార్యక్రమాలలో హీ రోహీరోయిన్లు, దర్శక రచయితలు కనిపిస్తున్నారు తప్ప రావు రమేష్ ఇంత వరకు కనిపించలేదు.ఆయన కూడా వస్తే సినిమాకు మరింత మైలేజీ వస్తుందని చెప్పాలి.
అయితే సాధారణంగా రావు రమేష్ సినిమాల ప్రచారానికి రారు.కానీ ఇది ఆయన చుట్టూ తిరిగిన సినిమా కాబట్టి, ఆయనొస్తే బాగుండేది.
రిలీజ్ కు ఇంకా 3 రోజులు టైమ్ ఉంది.ఈ గ్యాప్ లోనైనా ఆయన ప్రచారం చేస్తారేమో చూడాలి మరి.