ఇప్పటికే తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు ( Star heroes )వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న దర్శకులు సైతం పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాని లాంటి హీరో భారీ విజయాలను అందుకుంటున్నా నేపధ్యం లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తను ఒక సినిమా చేస్తున్నాడనే విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమా 2026 నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయట.

అయితే ఇందులో విలన్ గా ఒక స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ ఎలాంటి స్పందనను తెలియజేయనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి… ఇంతకి విలన్ గా చేసే ఆ స్టార్ హీరో ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక వైవిధ్యమైన గుర్తింపును సంపాదించుకొని తెలుగులో సైతం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న కమల్ హాసన్ గా తెలుస్తోంది.ఇప్పటికే ఈయన ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో( Kalki ) విలన్ గా నటించాడు.
ఇక మరోసారి చిరంజీవి( Chiranjeevi ) చేస్తున్న సినిమాలో కూడా విలన్ గా నటించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల కమల్ హాసన్ కి తన కథను కూడా వినిపించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది తెలియాలంటే ఈ సినిమా మేకర్స్ స్పందిస్తే తప్ప సరైన క్లారిటీ అయితే రాదు… కమల్ హాసన్ కనక చిరంజీవి సినిమాలో విలన్ గా నటిస్తే మాత్రం ఆ సినిమాకు భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది.చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమా భారీ రికార్డులను కూడా కొల్లగొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.