Dark Circles : డార్క్ సర్కిల్స్ కు పర్మినెంట్ గా బై బై చెప్పాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

డార్క్ సర్కిల్స్( Dark circles ) .ఎంతో మందిని కలవరపెట్టే చర్మ సమస్యల్లో ఒకటి.

 Follow This Home Remedy For Removing Dark Circles-TeluguStop.com

ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, ఆహారపు అలవాట్లు, శరీరానికి సరిపడా నీటిని అందించకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, గంటలు తరబడి ఫోన్లు టీవీలు చూడటం తదితర కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.ముఖం ఎంత తెల్లగా, నున్నగా ఉన్నా కళ్ళ చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు మొత్తం అందాన్ని దెబ్బతీస్తాయి.

అందుకే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడం కోసం ముప్పతిప్పలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? పర్మినెంట్ గా డార్క్ సర్కిల్స్ కు బై బై చెప్పాలనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు పర్ఫెక్ట్ గా యూస్ అవుతుంది.ఈ రెమెడీ ద్వారా చాలా సులభంగా డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవచ్చు.మళ్లీ అందంగా మెరిసిపోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Remedydark, Latest, Skin Care, Skin Care

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కరక్కాయ పౌడర్( Karakkaya powder ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( castor oil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక మంచి క్రీమ్ రెడీ అవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఖాళీగా ఉన్న సమయంలో తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ చాలా నెమ్మదిగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లటి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Remedydark, Latest, Skin Care, Skin Care

ఈ విధంగా ప్రతిరోజు కనుక చేశారంటే అద్భుత ఫలితాలను మీరు పొందుతారు.కరక్కాయ పొడి, ఆముదం మరియు అలోవెరా లో ఉండే ప్రత్యేక సుగుణాలు డార్క్ సర్కిల్స్ ను క్రమంగా మాయం చేస్తాయి.కొద్ది రోజుల్లోనే మీరు డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి బయటపడతారు.

ఇక ఈ రెమెడీని ఫాలో అవ్వడం తో పాటు బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.సాల్ట్ ను చాలా మితంగా తీసుకోండి.స్క్రీన్ టైం తగ్గించి కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.మ‌రియు డైట్ లో పోషకాలతో కూడిన ఆహారాలను చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube