ఇటీవల కాలంలో చాలా మందిని తెల్ల జుట్టు( White Hair ) సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది.వయసు పైబడిన వారే కాదు వయసులో ఉన్న వారు కూడా తెల్ల జుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు.
వైట్ హెయిర్ అనేది వృద్ధాప్యానికి సంకేతం.ఈ క్రమంలోనే తలలో తెల్ల వెంట్రుకలు రావడం స్టార్ట్ అవ్వగానే తెగ ఆందోళన చెందుతూ ఉంటారు.
కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీతో సులభంగా వైట్ హెయిర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి దాదాపు 8 నిమిషాల పాటు వేయించాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు,( Turmeric ) అరకప్పు ఎండిన కరివేపాకు వేసి పూర్తిగా నల్లగా మారేంతవరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న కరివేపాకు, కలోంజి సీడ్స్, పసుపు, కరివేపాకు వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.

అనంతరం ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న పొడితో పాటు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆవనూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ రెమెడీని కనుక ప్రయత్నిస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.తెల్ల వెంట్రుకలు రావడం దెబ్బకు కంట్రోల్ అవుతాయి.అలాగే తెల్లగా మారిన వెంట్రుకలు క్రమంగా నల్లబడతాయి.వైట్ హెయిర్ ప్రాబ్లం కు చెక్ పెట్టడానికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యిందని బాధపడటం మానేసి ఈ రెమెడీని ప్రయత్నించండి.