అసలే సమ్మర్ సీజన్( Summer Season ) నడుస్తోంది.ఈ సీజన్ లో కాసేపు బయట తిరిగామంటే చాలు ముఖం డార్క్ గా మరియు డల్ గా తయారవుతుంది.
అటువంటి చర్మాన్ని రిపేర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ప్రయత్నిస్తే కేవలం 10 నిమిషాల్లో డార్క్ అండ్ డల్ స్కిన్ ను( Dark And Dull Skin ) సూపర్ బ్రైట్ గా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న బంగాళదుంపను( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా ఫ్రెష్ పొటాటో జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పదినిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని తడి వేళ్ళతో సున్నితంగా రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

ఫైనల్ గా వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని ప్రయత్నించడం వల్ల చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి.ఎండల దెబ్బకు టాన్ అయిన స్కిన్ ను ఈ రెమెడీ సమర్థవంతంగా రిపేర్ చేస్తుంది.చర్మం యొక్క డల్ నెస్ ను పోగొడుతుంది.డార్క్ స్కిన్ సూపర్ వైట్ గా బ్రైట్ గా మెరిపిస్తుంది.

అలాగే ఈ రెమెడీ పిగ్మెంటేషన్ చికిత్సలో సహాయపడుతుంది.వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ రెమెడీని ట్రై చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.స్కిన్ కలర్ ఈవెన్ గా మారుతుంది.
చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉన్నా కూడా క్రమంగా మాయం అవుతాయి.