వ్యాయామం చేయ‌కుండా బ‌రువు త‌గ్గ‌డం సాధ్య‌మేనా.. ఇక్క‌డ తెలుసుకోండి!

ప్ర‌స్తుత రోజుల్లో కోట్లాది మందిని పీడిస్తున్న స‌మ‌స్య అధిక బ‌రువు.( Over Weight ) ఓవ‌ర్ వెయిట్‌ కారణంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, మోకాళ్లు, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఇలా ర‌క‌ర‌కాల జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.

 Is It Possible To Lose Weight Without Exercising Details, Weight Loss, Weight Lo-TeluguStop.com

ఈ క్రమంలోనే వెయిట్ లాస్ అవ్వడం కోసం చాలా మంది తెగ‌ ప్రయత్నిస్తూ ఉంటారు.నిత్యం జిమ్‌ లో చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తుంటారు.

అయితే వ్యాయామం( Exercise ) చేయకుండా బరువు తగ్గడం సాధ్యమేనా? అన్న‌ డౌట్ చాలా మందికి ఉంది.అవును సాధ్యమే.

కానీ ఇది ఆహార నియంత్రణ మరియు జీవనశైలి మార్పులపై ఆధారపడి ఉంటుంది.

మొద‌ట‌గా డైట్ పై దృష్టి సారించాలి.

రోజువారీ తీసుకునే ఆహారంలో కేలరీలను త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవ‌డం చాలా ముఖ్యం.అలాగే ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు, శనగలు, చికెన్, పెరుగు వంటి ఆహారాల‌ను తీసుకోవాలి.

ఇవి ఆకలిని తగ్గించి ఎక్కువ స‌మ‌యం పాటు పొట్ట నిండిగా ఉన్న ఫీలింగ్ ను క‌లిగిస్తాయి.ఫైబర్ ఎక్కువగా ఉండే కాయగూరలు, పండ్లు, గింజలు తినాలి.

త‌ద్వారా అజీర్తి తగ్గి, మెటబాలిజం మెరుగవుతుంది.అదే స‌మ‌యంలో నీరు ఎక్కువ‌గా తీసుకోవాలి.

భోజ‌నానికి అర‌గంట ముందు గ్లాస్ వాట‌ర్ తాగితే ఫుడ్ త‌క్కువ‌గా తింటారు.చిప్స్, జంక్ ఫుడ్, తీపి పదార్థాలకు ఎంత దూరంగా ఉండే అంత వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

Telugu Diet, Exercise, Tips, Healthy Diet, Healthy, Junk, Latest, Lifestyle, Foo

జీవనశైలి విష‌యానికి వ‌స్తే.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.లేదంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్ప‌డి ఆకలి పెరుగుతుంది.ఒత్తిడికి దూరంగా ఉండండి.స్ట్రెస్ వల్ల కార్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది.ఇది వెయిట్ గెయిన్ కు దారి తీస్తుంది.

కాబ‌ట్టి, స్ట్రెస్ ను ఎవైడ్ చేయ‌డానికి ధ్యానం, యోగా( Yoga ) చేయండి.భోజ‌నం స‌మ‌యంలో టీవీ, ఫోన్ ను ప‌క్క‌న పెట్టండి.

పూర్తి శ్రద్ధ భోజ‌నంపై పెడితే ఎక్కువ తినకుండా నియంత్రించుకోవచ్చు.ఫుడ్ ఎప్పుడూ నెమ్మ‌దిగా బాగా న‌ములుతూ తినాలి.

ద్వారా తక్కువ ఆహారం తీసుకుంటారు.

Telugu Diet, Exercise, Tips, Healthy Diet, Healthy, Junk, Latest, Lifestyle, Foo

ఇక వ్యాయామం చేయకపోయినా, రోజుకు ఎనిమిది నుంచి ప‌దివేలు అడుగులు నడవ‌డానికి ప్ర‌య‌త్నించండి.ఇంటి ప‌ని, వంట ప‌ని, తోట‌ప‌ని మీరే చేసుకోండి.ఎత్తైన కట్టడాల్లో ఉంటే లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కి దిగండి.

ఇలా శ‌రీరానికి కదలికలు పెంచడం ద్వారా మెటబాలిజం పెరుగుతుంది.వ్యాయామం చేయ‌క‌పోయినా ఆహార నియంత్రణ మరియు ఈ జీవనశైలి మార్పులతో వెయిట్ లాస్ అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube