ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ( Betting Apps ) ప్రమోట్ చేస్తున్న వారిపై పెద్ద ఎత్తున కేసులో నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం ఇప్పటికే మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలువురి పై కేసులు నమోదు అయ్యాయి.
ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది నాశనం చేసుకున్న వారు ఉన్నారు.అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి అంటూ పోలీసులు తెలియజేశారు.
ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ద్వారా 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నటువంటి నెల్లూరు( Nellore ) కు చెందిన ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు.

ఇక ఈయన అక్కడ తన ఆవేదన మొత్తం బయటపెట్టారు.తాను మేస్త్రి పనులు చేసుకుంటూ ఉండేవాడిని.బాలకృష్ణ( Balakrishna ) హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్( Un Stoppable Show ) కార్యక్రమంలో ఫన్ 88 ( Fun 88 ) బెట్టింగ్ యాప్ యాడ్ చూశాను.అది చూసి తాను కూడా గేమ్ ఆడటం మొదలుపెట్టానని నెల్లూరుకు చెందిన బాధితుడు ఈ వివరాలను బయటపెట్టారు.2023లో ఆడటం స్టార్ట్ చేశాను.మొదట్లో డబ్బులు పెడితే బాగా లాభాలు వచ్చాయని తెలిపారు.

అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రభాస్ కి ఫన్ 88 బాక్స్ గిఫ్ట్ ఇస్తూ.ఇందులో చాలా గేమ్స్ ఉంటాయ్ ఆడండి గిఫ్ట్లు పట్టండి అని చెప్పి ఇస్తాడు.ఇలా ఈ వీడియో చూసి తాను గేమ్ ఆడటం మొదలుపెట్టానని తెలిపారు.ముందు రూ.10వేలు పెడితే రూ.18వేలు వచ్చింది.బాగా డబ్బులు వచ్చాయి.అలా ఒకటిన్నర నెలల్లో రూ.3లక్షలు సంపాదించాను.ఆడుతున్న క్రమంలో డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నాను చివరికి 80 లక్షల రూపాయల వరకు అప్పు చేశానని ఈ గేమ్ కారణంగా నా జీవితమే నాశనం అయ్యింది అంటూ ఈయన తన ఆవేదన మొత్తం బయటపెట్టారు.