రామ్ చరణ్ ( Ram Charan )హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్( Game changer ).ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా భారీ అంచనాల నడుమ విడుదల అయి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.కోట్ల బడ్జెట్ తో నిర్మించిన దిల్ రాజుకు( Dil raju ) ఈ సినిమా బోలెడు నష్టాలను మిగిల్చింది.
భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు అభిమానులకు ఈ సినిమా నిరాశను మిగిల్చింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం ఏంటి ఎవరు అనే సంగతి పక్కన పెడితే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు రెండు నెలలు దాటిపోయిన కూడా ఎక్కడో ఒకచోట ఈ సినిమాకు సంబంధించిన టాపిక్ వినిపిస్తూనే ఉంది.

తాజాగా నిర్మాత దిల్ రాజు కారణంగా మరోసారి ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యింది.ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ విషయానికొస్తే.మోహన్ లాల్,పృథ్వీరాజ్ ఎల్ 2: ఎంపురన్ మూవీ( Mohanlal, Prithviraj L2: Empuran Movie ) వచ్చే వారం రిలీజ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.తాము ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని, లాభాల్లో వాటా తీసుకుంటామని నటుడు పృథ్వీరాజ్ చెప్పారు.
అయితే గేమ్ ఛేంజర్ సినిమాకి కూడా తొలుత ఇలానే ఫ్రాపిట్ షేర్ ప్లాన్ అనుకున్నామము తర్వాత ప్లాన్ మారిపోయిందని దిల్ రాజు చెప్పారు.

అంతకు ముందు గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్నిరోజులకు మీడియాతో మాట్లాడిన దర్శకుడు శంకర్ ( Director Shankar )5 గంటల పుటేజీ రావడంతో తాను అనుకున్న మంచి సీన్లు సినిమాలో పెట్టలేకపోయానని, అందుకే ఫ్లాప్ అయిందని చెప్పుకొచ్చాడు.ఇలా దిల్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు.ఒక ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.
హుక్ స్టెప్స్ లేకపోవడం వల్లే గేమ్ ఛేంజర్ పాటలు ఫెయిల్ అయ్యాయని చెప్పుకొచ్చారు.అయితే కారణం ఏంటి కారణం ఎవరు అనే సంగతి పక్కన పెడితే ఈ సినిమా మాత్రం అభిమానులకు నిరాశని మిగిల్చింది.