ఇవాంకా ట్రంప్ ఫైట్ వీడియో లీక్.. ఎవరితోనో తెలిస్తే నోరెళ్లబెడతారు..?

సాధారణంగా ఇవాంకా ట్రంప్ ( Ivanka Trump )రాజకీయాలు, వైట్ హౌస్ వంటి విషయాలతో వార్తల్లో నిలుస్తుంది.కానీ ఇప్పుడు ఆమె వేరే కారణంతో వార్తల్లో నిలిచింది.

 Will Ivanka Trump's Fight Video Leak Be Leaked To Anyone, Ivanka Trump, Jiu-jits-TeluguStop.com

ఇవాంకా ట్రంప్ జియు-జిట్సులో శిక్షణ తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.మయామిలోని ఓ జిమ్‌లో( gym in Miami ) తీసిన ఈ వీడియోలో ఇవాంకా సెల్ఫ్-డిఫెన్స్ మూవ్స్‌తో అదరగొట్టింది.

ఈ జిమ్ యజమాని ఎవరో కాదు.సూపర్ మోడల్ గిసెల్ బండ్చెన్ ప్రియుడు జోక్విమ్ వాలెంటె.

43 ఏళ్ల ఇవాంకా ఈ వీడియోలో బ్లూ బెల్ట్ ధరించి ( Wearing a blue belt )జిమ్ టీచర్‌కు చుక్కలు చూపించింది.టీచర్‌ని నేలకేసి కొట్టి, బలంగా పంచ్‌లు విసిరింది.కత్తితో దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలో కూడా ప్రాక్టీస్ చేసింది.వాలెంటె బ్రదర్స్ స్టూడియోలో ఇవాంకా రెగ్యులర్‌గా ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటుంది.ఈ స్టూడియోకి 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.”జియు-జిట్సు కేవలం మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదు.ఇది శారీరక ధైర్యాన్ని, మానసిక ఏకాగ్రతను, భావోద్వేగ సమతుల్యతను పెంచుతుంది” అంటూ వాలెంటె బ్రదర్స్ ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.జోక్విమ్, అతని సోదరులు గూయి, పెడ్రో వాలెంటెతో కూడా ఇవాంకా శిక్షణ తీసుకుంటుంది.

వీడియోలో వీరంతా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం చూడొచ్చు.తన కుటుంబం కూడా ఈ స్టూడియోలో ఫిట్‌నెస్ కోసం శిక్షణ తీసుకుంటుందని ఇవాంకా గతంలోనే చెప్పింది.

ఇటీవలి కాలంలో ఇవాంకా రాజకీయాలకు దూరంగా తన కుటుంబం, వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.తండ్రి డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సీనియర్ సలహాదారుగా పనిచేసింది.కానీ రెండోసారి ట్రంప్ పోటీ చేసినప్పుడు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంది.ఇవాంకా జారెడ్ కుష్నర్‌ను పెళ్లి చేసుకుంది.వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఇవాంకా కుస్తీ విన్యాసాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.“వావ్, సూపర్బ్‌గా చేశారు.చాలా ఇంప్రెస్ అయ్యా.మా అమ్మాయికి కూడా జియు-జిట్సు నేర్పించాలి.” అని ఒకరు కామెంట్ చేస్తే.“మహిళలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా గొప్ప విషయం” అని మరొకరు రాసుకొచ్చారు.జియు-జిట్సును పాఠశాలల్లో సిలబస్‌లో చేర్చాలని, ఇది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కొందరు సలహా ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube