ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం కొత్త కొత్త వ్యాపార ప్రకటనలు (Advertisements) వైరల్ అవుతూనే ఉన్నాయి.సాంకేతికత పెరుగుతున్నకొద్దీ మార్కెటింగ్ స్ట్రాటజీలు కూడా మారిపోతున్నాయి.
ఒకప్పుడు మౌఖిక ప్రకటనలు మాత్రమే ఆధారంగా ఉండేవి.కానీ, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కొన్ని సరికొత్త ఐడియాలు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి.
కొన్ని వ్యాపారులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి వినూత్న మార్గాలను అనుసరిస్తూ జనాలను ఆకర్షిస్తున్నారు.అలాంటి ఒక ఆసక్తికరమైన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎండలు ముదురుతున్న వేళ పిల్లలు ఐస్ క్రీమ్ (Ice Cream) కోసం తల్లిదండ్రులను వెంట పడే కాలం ఇది.సాధారణంగా, ఐస్ క్రీమ్ వ్యాపారులు ఊరంతా తిరుగుతూ “ఐస్ క్రీమ్.ఐస్ క్రీమ్” అంటూ గట్టిగా కేకలు వేస్తూ అమ్మడం మనం గమనించే ఉంటాము.అయితే, ఒక వ్యక్తి మాత్రం తన వ్యాపారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నాడు.
అందుకోసం అతను ఒక ఫన్నీ అనౌన్స్‌మెంట్ వాయిస్ రికార్డు చేసుకొని, తన బండిపై బిగించి ఊరంతా తిరుగుతున్నాడు.ఆ రికార్డులో.అరేయ్ పిల్లల్లారా! బాగున్నార్రా? ఐస్ క్రీమ్ బండి వచ్చింది.వెంటనే కొనుక్కొండి.
డబ్బులు అమ్మను అడగండి.ఆమె ఇవ్వకపోతే నాన్నను అడగండి.
ఆయన ఇవ్వకపోతే బామ్మను అడగండి.ఆమె ఇవ్వకపోతే తాతను అడగండి.
ఆయనా ఇవ్వకపోతే ఏడుస్తూ ఇంట్లోనే కూర్చోండి!” అంటూ పెట్టాడు.ఈ ప్రకటన వినగానే పిల్లలు నవ్వుకుంటూ బండివైపు పరుగులు తీస్తున్నారు.
ఇది గమనించిన గ్రామస్థులు, కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారిపోయింది.నెటిజన్లు ఈ వ్యాపార స్థైర్యాన్ని, ఆ వ్యక్తి మార్కెటింగ్ స్కిల్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.నీ ఐడియా సూపర్ పెద్దయన అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.
మరికొందరు ఏమో ఈ మాటలు వినగానే పిల్లలు ఏడ్చి అయినా ఐస్ క్రీమ్ కొనించుకుంటారు అంటూ కామెంట్లు తెగ చేస్తున్నారు.ఇప్పుడు వ్యాపారం అంటే కేవలం నాణ్యమైన ఉత్పత్తిని అమ్మడం మాత్రమే కాదు, వినియోగదారులను ఆకర్షించే విధంగా మార్కెటింగ్ చేయడం కూడా చాలా ముఖ్యం.
చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద కార్పొరేట్ కంపెనీల వరకు మార్కెటింగ్ కోసం కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు.ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ వ్యాపారి చేసిన మాదిరిగా ప్రతి వ్యాపారి కూడా వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తే, తమ వ్యాపారాన్ని మరింత విజయవంతంగా మార్చుకోవచ్చు.