ప్రస్తుతరోజుల్లో వివాహ వేడుకలు మరింత రంగులద్దిన విధంగా నూతన ప్రయోగాలు చేస్తున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి.వివాహ ఫోటోషూట్‌లో మరింత అందం కోసం విభిన్నమైన ఆలోచనలు అమలులోకి తెస్తున్నారు.
కానీ, కొన్ని సందర్భాల్లో ఈ ప్రయోగాలు ప్రమాదకరంగా మారతాయి.తాజాగా, ఓ పెళ్లి ఫోటోషూట్‌లో( Wedding Photoshoot ) జరిగిన దురదృష్టకర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కెనడాలో( Canada ) నివసిస్తున్న భారత సంతతికి చెందిన విక్కీ, పియా దంపతులు పెళ్లి కోసం బెంగళూరుకు వచ్చారు.తమ ప్రత్యేక రోజును మరింత గుర్తించేందుకు వివాహ ఫోటోషూట్‌లో కలర్ బాంబులను( Color Bombs ) ఉపయోగించాలని నిర్ణయించారు.
అయితే, ప్లాన్ చేసినట్లుగా బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ బాంబులు పేలాల్సినప్పటికీ అవి అకస్మాత్తుగా దారుణంగా పేలిపోయాయి.
ఆ పేలుడు నేరుగా విక్కీ, పియా దంపతులను తాకింది.ముఖ్యంగా ఈ ఘటనలో పియా తీవ్రంగా గాయపడింది.ఈ ఘటన అనంతరం పెళ్లి వేడుక రిసెప్షన్ మధ్యలోనే ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
ఈ సంఘటన తర్వాత, పెళ్లిలో ఇలాంటి ప్రమాదకరమైన పదార్థాలను ఉపయోగించడంపై అవగాహన పెంచేందుకు విక్కీ, పియా తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ ఘటనతో పెళ్లి వేడుకల్లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
పియా తన గాయాలతో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.తన భర్త నన్ను ఎత్తుకుని ఉండగా, కలర్ బాంబు మమ్మల్ని నేరుగా తాకింది అంటూ పోస్ట్ చేసింది.వీడియోలో ఆమె వీపు భాగంలో తీవ్రమైన కాలిన గాయాలు, అలాగే జుట్టు పూర్తిగా కాలిపోయినట్లు కనిపిస్తోంది.ఇటీవలి కాలంలో వివాహ వేడుకల్లో ఫోటోషూట్ కోసం పటాకులు, పొగ బాంబులు, ఇతర రసాయన పదార్థాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.
అయితే, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా వీటిని ఉపయోగించడం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది.