రింకూ డాన్స్ కు పడిపడి నవ్విన కింగ్ కోహ్లీ.. వైరల్ వీడియో

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది.శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు.

 Viral Video Of King Kohli Laughing While Watching Rinku Dance, Ipl 2025, Rcb Vs-TeluguStop.com

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, హీరోయిన్ దిశా పటానీ తమ అద్భుతమైన ప్రదర్శనలతో అభిమానులను అలరించారు.ఇకపోతే, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) సహ యజమాని అయిన షారుఖ్ ఖాన్ మైదానంలో ఓ మ్యాజిక్ క్రియేట్ చేశాడు.

క్రికెటర్లతో కలిసి డ్యాన్స్ చేయించి స్టేడియంనే ఊపేశాడు.ముఖ్యంగా, విరాట్ కోహ్లీతో షారుఖ్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.

అయితే రింకూ సింగ్ ‘డంకీ’ సినిమాలోని ‘లుట్ పుట్ గయా’ పాటకు చేసిన డ్యాన్స్‌ను చూసి కోహ్లీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు.ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో షారుక్ ఖాన్, రింకు సింగ్ కలిసి డాన్స్ చేస్తుండగా.పక్కన కోహ్లీ నిలబడి ఉన్నాడు.పాట ప్లే అవ్వగా మొదటగా షారుక్ ఖాన్ డాన్స్ మొదలు పెట్టగా రింకు సింగ్ అనుసరించడం మొదలుపెట్టాడు.అయితే ఇది కాస్త కష్టంగానే సాగిందని చెప్పవచ్చు.ఈ సందర్భంలో రింకూ సింగ్ డాన్స్ ను చూసి స్టేజిపై వారి పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ పడిపడి నవ్వాడు.ఓపెనింగ్ వేడుకల తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అదరగొట్టింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మొదట టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది.

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.కెప్టెన్ అజింక్యా రహానే (56; 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (44; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (3 వికెట్లు) మెరుగైన ప్రదర్శన చేశాడు.జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, యష్ దయాల్, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు.

175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆర్‌సీబీ మొదటి నుండి దూకుడుగా ఆడింది.16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56; 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి, ఆరంభాన్ని ఘనంగా ఇచ్చాడు.

ఇక విరాట్ కోహ్లీ (59 నాటౌట్; 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మళ్లీ తన క్లాస్‌ను చూపించాడు.ఆట ముగిసే సమయానికి కెప్టెన్ రజత్ పాటిదార్ (34; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) కూడా మెరుపులు మెరిపించి, ఆర్‌సీబీని గెలిపించాడు.

ఈ విజయంతో బెంగళూరు తమ ఐపీఎల్ 2025 ప్రయాణాన్ని అద్భుతంగా ఆరంభించింది.ఈ మ్యాచ్‌లో కోహ్లీ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసి అభిమానులకు వినోదాన్ని అందించగా.షారుఖ్ ఖాన్, రింకూ సింగ్ డ్యాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube