బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (3 వికెట్లు) మెరుగైన ప్రదర్శన చేశాడు.జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, యష్ దయాల్, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు.
"""/" /
175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆర్‌సీబీ మొదటి నుండి దూకుడుగా ఆడింది.
16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56; 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి, ఆరంభాన్ని ఘనంగా ఇచ్చాడు.
ఇక విరాట్ కోహ్లీ (59 నాటౌట్; 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మళ్లీ తన క్లాస్‌ను చూపించాడు.
ఆట ముగిసే సమయానికి కెప్టెన్ రజత్ పాటిదార్ (34; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) కూడా మెరుపులు మెరిపించి, ఆర్‌సీబీని గెలిపించాడు.
ఈ విజయంతో బెంగళూరు తమ ఐపీఎల్ 2025 ప్రయాణాన్ని అద్భుతంగా ఆరంభించింది.ఈ మ్యాచ్‌లో కోహ్లీ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసి అభిమానులకు వినోదాన్ని అందించగా.
షారుఖ్ ఖాన్, రింకూ సింగ్ డ్యాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చైనా అమ్మాయి మనసు బంగారం.. తమిళనాడు వ్యాపారవేత్తకు రూ.30 లక్షల కారు బహుమతి..