ఇంగ్లాండ్‌లోని ఓ బీచ్‌లో వింత ఆకారం కనిపించి అందరినీ షాక్‌కి గురిచేసింది.బ్రిటన్‌కు చెందిన పౌలా, డేవ్ రీగన్ అనే దంపతులు మార్చి 10న మార్గేట్, కెంట్ తీరంలో అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఈ వింత దృశ్యం కనిపించింది.
వాళ్లకి సముద్రపు ఒడ్డున ఇసుకలో సగం కూరుకుపోయి, నాచు మధ్యలో ఒక వింత ఆకారం కనిపించింది.చూడటానికి అది అచ్చం అస్థిపంజరంలా ఉంది.
చేప తోక, గ్రహాంతర జీవిలా తల ఉండటంతో అది నిజంగానే వింతగా అనిపించింది.
మొదట అది ఏదో కొయ్య ముక్కో లేకపోతే చనిపోయిన సీలో అనుకున్నారట.కానీ దగ్గరికి వెళ్లి చూస్తే దాని తోక చేపలా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.“నా జీవితంలో ఇలాంటి వింతైన వస్తువుని ఎప్పుడూ చూడలేదు.అది నిజంగా చాలా విచిత్రంగా ఉంది” అని పౌలా చెప్పింది.దాని తల అస్థిపంజరంలా ఉంటే, తోక మాత్రం మెత్తగా, జారుడుగా లేకుండా వింతగా అనిపించిందట.అది జిగురుగానో, కుళ్లినట్టుగానో లేదని, కానీ చాలా వింతగా ఉందని ఆమె చెప్పింది.
ఆ వింత ఆకారాన్ని చూడటానికి చుట్టుపక్కల వాళ్లంతా గుమికూడారు.కానీ అది ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.కొందరు అది పడవలోంచి పడిపోయి ఉంటుందని, మరికొందరు ఓడ బొమ్మ అయి ఉంటుందని రకరకాలుగా ఊహించారు.
ఫోటో తీయకపోతే ఎవరూ నమ్మరనిపించి వెంటనే దాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.అంతే ఇక అది వైరల్ అయిపోయింది.
నిజానికి ఇలాంటి వింత సముద్ర జీవులు కనిపించడం ఇదేం మొదటిసారి కాదు.పోయిన నెలలో రష్యాకు చెందిన రోమన్ ఫెడర్‌త్సోవ్ అనే జాలరికి గల్ఫ్ సముద్రంలో మునుపెన్నడూ చూడని వింత చేప చిక్కింది.బూడిద రంగులో, బల్బులా ఉబ్బిన ఆ చేప పేరు ‘స్మూత్ లంప్‌సకర్’.
ఇది అడుగు పొడవు వరకు పెరుగుతుందట.ఇంకా అమెరికాలో ఎరిక్ ఓసింకీ అనే జాలరికి సముద్రపు దీపపు చేప (సీ లాంప్‌రే) చిక్కింది.
దాని భయంకరమైన నోరు, రంపపు పళ్లు చూస్తేనే భయమేస్తుంది.ఈ పరాన్నజీవి చేప తన నోటితో ఇతర చేపలకు అతుక్కుని వాటి రక్తాన్ని పీల్చేస్తుంది.
ఇలా రకరకాల వింత జీవులు సముద్రంలో తరచూ కనిపిస్తూనే ఉంటాయి.