తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా( Milk Beauty Tamannaah ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేయడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ బాలీవుడ్ అని భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటుంది.

కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలోనే కాకుండా అప్పుడప్పుడు ప్రేమ రిలేషన్ వంటి విషయాలలో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో తమన్నా తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉన్న విషయం తెలిసిందే.తాజాగా తమన్నా పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.తమన్నా హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2( Odela 2 ).2021 లో వచ్చిన వదిన రైల్వే స్టేషన్ కు చెందిన ఓదెల రైల్వే స్టేషన్‌కు( Odela Railway Station ) సీక్వెల్‌గా తెరకెక్కింది.

హెబ్బా పటేల్, వశిష్ట సింహ( Hebba Patel, Vashishta Simha ) కీలక పాత్రలు పోషించారు.సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.అయితే తాజాగా శనివారం నాడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఏప్రిల్ 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.అందులో తమన్నా ముఖం రక్తసిక్తంగా కనిపిస్తోంది.ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.అందరూ నన్ను తెలుగమ్మాయే అనుకుంటారు.
నేను కూడా అలాగే ఫీలవుతాను.నాకు కోపం వచ్చినప్పుడు తెలుగే మాట్లాడతాను.
తెలుగులోనే తిడతాను అని చెప్పుకొచ్చింది.ఇకపోతే ఓదెల 2 కోసం తమన్నా మాంసాహారం తినడం కూడా మానేసిందట.
ఈ సందర్భంగా తమన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.