నా మనసు గెలుచుకున్నావ్... కెమెరామెన్ పై ప్రశంసలు కురిపించిన నేషనల్ క్రష్! 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారో ఒకవైపు తెలుగు సినిమాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు.ఇలా కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు వివాదాలలో కూడా నిలుస్తున్న సంగతి తెలుస్తుంది.

 Camera Men Impressed To Rashmika Mandanna With His Dance, Rashmika, Sikindar,sal-TeluguStop.com

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక ఇటీవల కన్నడ సినిమాల గురించి కన్నడ భాష గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈమెపై మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా ఈమె వార్తలు నిలుస్తున్నారు.ఇదిలా ఉండగా రష్మిక త్వరలోనే సికిందర్ (Sikindar) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salmankhan) హీరోగా నటించిన ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఇకపోతే తాజాగా ఈమెకు ముంబై ఎయిర్ పోర్టులో అభిమాని నుంచి ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది ఇలా ఎయిర్ పోర్టులో ఈమెను చూసినటువంటి ఒక కెమెరామెన్ తన డ్యాన్స్ తో ఫిదా చేశాడు.ఏకంగా ఎయిర్ పోర్టులో ఈ అమ్మడి కోసం ప్రత్యేకంగా సికిందర్ పాట మీద డ్యాన్స్ చేస్తు నేషనల్ క్రష్ ను తన క్రష్ గా మారేలా చేశారు.ఈయన చేసిన డాన్స్ కు రష్మిక ఫిదా అవ్వడమే కాకుండా నా మనసును గెలుచుకున్నావు అంటూ లవ్ ఎమోజిని చూపించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/reel/DHfZsiXznzn/?igsh=MWd4ajJ6eGp1Nms3YQ==
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube