నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ( Sunita Williams, Butch Wilmore )అనుకున్నది ఒక్కటి, జరిగింది మరొకటి.అసలు 8 రోజులు మాత్రమే అంతరిక్షంలో ఉండాల్సిన వీళ్లు ఏకంగా 286 రోజులు అక్కడ మకాం వేయాల్సి వచ్చింది.
బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో వీళ్ల ట్రిప్ అనుకోకుండా తొమ్మిది నెలలు సాగింది.అయితే ఇన్ని రోజులు ఎక్కువ పనిచేసినా వీళ్లకు మాత్రం అదనంగా పైసా కూడా రాలేదు.
ఎందుకంటే నాసా ఆస్ట్రోనాట్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కదా.అమెరికా గవర్నమెంట్ రూల్స్ వాళ్లకి కూడా వర్తిస్తాయి.జనరల్ షెడ్యూల్ పే సిస్టమ్ ప్రకారం, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్లకి ఓవర్ టైం చేసినా, వీకెండ్స్‌లో పనిచేసినా, హాలిడేస్‌లో డ్యూటీ చేసినా ఎక్స్‌ట్రా డబ్బులేమీ ఇవ్వరు.అంతరిక్షంలో ఉన్నా కూడా అంతే.
వాళ్లు అంతరిక్షంలో ఉన్న టైమ్‌ని కూడా మామూలు గవర్నమెంట్ టూర్‌లాగే లెక్కిస్తారు.ప్రయాణం, భోజనం, బస అన్నీ నాసానే చూసుకుంటుంది.
అంతేకాదు, చిన్న ఖర్చుల కోసం రోజుకి 5 డాలర్లు ఇస్తారు.దీన్ని ‘ఇన్సిడెంటల్ పే’( Incidental Pay ) అంటారు.సుమారు 286 రోజులు వాళ్లు స్పేస్‌లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 1,430 డాలర్లు (దాదాపు రూ.1.23 లక్షలు) ఇన్సిడెంటల్ పే కింద ఇస్తారు.ఇది వాళ్ల జీతాలకు అదనం అన్నమాట.జీతాల సంగతికొస్తే, వాళ్ల వార్షిక జీతం రూ.81.7 లక్షల నుంచి రూ.1.06 కోట్ల వరకు ఉంటుంది.

ఇక్కడే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఈ విషయం తెలిసాక ఆయన నోట వెంట విస్మయం వ్యక్తమయింది.“ఇదా మొత్తం? వాళ్లు పడ్డ కష్టానికిది చాలా తక్కువ కదా” అంటూ ఆశ్చర్యపోయారు.అవసరమైతే తన జేబులోంచి డబ్బులిస్తానని కూడా అన్నారు.
ఇంతవరకు ఈ విషయం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని కూడా ఆయన వాపోయారు.

వ్యోమగాములను క్షేమంగా భూమికి చేర్చడంలో సాయం చేసినందుకు ఎలాన్ మస్క్‌కి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.స్పేస్‌ఎక్స్ లేకపోతే వాళ్లు ఇంకా అక్కడే చిక్కుకుపోయేవారని ఆయన అన్నారు.దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండడం వల్ల వ్యోమగాములు ఎదుర్కొనే శారీరక ఇబ్బందుల గురించి కూడా ట్రంప్ మాట్లాడారు.
కండరాలు, ఎముకలు బలహీనపడతాయని ఆయన గుర్తు చేశారు.