తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నేను శైలజ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.
నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో చివరిగా సర్కారు వారి పాట, దసరా,భోళా శంకర్ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
అలాగే హిందీలో బేబీ జాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.అయితే ఈ సినిమా కంటే ముందు కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో( Antony ) మూడు ముళ్ల బందంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత బాలీవుడ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించడంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్( Baby John ) మూవీలో నటించింది.పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది కీర్తి.ఆ సంగతి పక్కన పెడితే గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ సినిమాలో ఎంట్రీ గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతోందని తన భర్తతో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూసుకోబోతోందని వార్తలు వినిపించాయి.అయితే తెలుగులో సినిమాలు తగ్గించింది కానీ కెరీర్ ఆపలేదు కీర్తి సురేష్.

తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూనే ఉంది.ఇప్పుడు టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టింది.తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలో నితిన్( Nithin ) సరసన హీరోయిన్గా నటించబోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.బలగం వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రాబోతున్న ఎల్లమ్మ సినిమాలో( Yellamma Movie ) కీర్తి సురేష్ ను హీరోయిన్ తీసుకునేందుకు చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది.
నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా సాయి పల్లవిని అనుకున్నారట.కానీ హిందీ రామాయణ్ సినిమా వల్ల బిజీగా ఉన్న సాయి పల్లవి, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట.
దీంతో ఆ అవకాశం కీర్తి సురేష్ ను వరించిందట.ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.