ముఖ్యంగా చెప్పాలంటే మానవ శరీరంలో ఏ సమస్యలైనా దాచడం సాధ్యమేమో కానీ పెదవులకు వచ్చే సమస్యలు ఇట్టే బయటపడుతూ ఉంటాయి.దాని వల్ల అనారోగ్యం బయటపడడంతో పాటు అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది.
ఫలితంగా సెల్ఫ్ ఎస్టిమ్( Self esteem ) కూడా తగ్గిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా పెదవులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
అందుకే పెదవుల ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.అలాగే సిగరెట్లు ( Cigarettes )తాగే వారిలో పెదాలు నల్లగా, బండగా మారిపోతూ ఉంటాయి.అందుకే స్మోకింగ్ అలవాటును వెంటనే మానేయాలి.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చాలా మందికి లిప్‌స్టిక్ ఉపయోగించే అలవాటు ఉంది.అలాంటి మహిళలు లిప్ స్టిక్ కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
అందులో ప్రొఫైల్ గ్యాలేట్ అనే రసాయన పదార్థం ఉంటుంది.దాని వల్లనే ప్రధానంగా అలర్జీలు వస్తూ ఉంటాయి.
లిప్ స్టిక్ వాడే వారు అది తమకు సరిపడుతుందా లేదా అన్న విషయాన్ని ముందుగా పరిశీలించి తమకు సరిపడుతుందని తెలిసిన తర్వాతే వాటిని వాడడం మంచిది.

ఇంకా చెప్పాలంటే నిద్రపోయే ముందు లిప్ స్టిక్( Lipstick ) శుభ్రంగా కడుక్కోవడం మంచిది.ఆ సమయంలో పెదవుల పై పలుచగా నెయ్యి లేదా బాదం నూనె( Ghee almond oil ) రాసుకోవడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే కొన్ని టూత్ పేస్ట్ ల వల్ల కూడా మన పెదవుల పై దురద వస్తువుంటుంది.
అలాంటప్పుడు వాటిని ఉపయోగించడం ఆపేయడమే మంచిది.అంతే కాకుండా నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.
అలాగే పెదవుల తడి ఆరిపోకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం.అయితే నాలుకతో తడపకూడదు.
ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి.