1.విజయవాడలో 144 సెక్షన్
ఈనెల 17న చలో విజయవాడకు విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో 144 సెక్షన్ ను విధిస్తున్నట్లు నగర కమిషనర్ క్రాంతి రాణా టాటా తెలిపారు.
2.గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

ఇటీవల కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శించారు.ఆల్వాల్ లోని గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
3.తిరుగులేని విజయాలు సాధించాం : కేసీఆర్
విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని , అనతి కాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు .స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేసిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
4.నడకదారుల్లో ప్రతి భక్తుడికి చేతి కర్ర

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో దాడులు ఘటన నేపథ్యంలో 12 ఏళ్ల లోపు పిల్లలను తల్లిదండ్రులు ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.అలాగే కాలి నడకన వెళ్లే ప్రతి భక్తుడికి చేతి కర్ర ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
5.ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా సుధాకర్ రావు
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ఆచార్య ఎన్ సుధాకర్ రావు ను నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
6.శ్రీవారి సేవలు సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జాల్ బుయాన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
7.రేవంత్ రెడ్డి కామెంట్స్
ఎస్సీ ,ఎస్టీ వర్గీకరణ పై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వ్యక్తుల కోసం ఎస్సీ వర్గీకరణ చేయమని ఆయన అన్నారు.
8.జగన్ పై వర్ల రామయ్య విమర్శలు

జగన్ దళితులకు మేనమామ కాదని, కంస మామ అని టిడిపి బులెట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.
9.ఒంగోలు నుంచే పోటీ చేస్తా : బాలినేని
వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
10.పవన్ కళ్యాణ్ కామెంట్స్

జనసేన వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.పార్టీలో వీర మహిళలుగా ప్రాధాన్యత ఇచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నామని పవన్ అన్నారు.
11.షర్మిల పాదయాత్రకు రికార్డ్
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్ లో చేరింది.షర్మిల చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఈ రికార్డు దక్కింది.
12.చంద్రబాబు శుభాకాంక్షలు

ఏపీ తోపాటు, దేశ ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
13.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.స్వామివారి దర్శనం కోసం నేడు 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
14.జగన్ వస్తే విశాఖకు నష్టం : బుద్దా

జగన్ హయాంలో గుంటూరు , విజయవాడ నాశనం అయ్యాయని, ఇప్పుడు విశాఖపట్నం వచ్చేందుకు ముహూర్తాలు ఖరారు చేస్తున్నారని, ఆయన వస్తే విశాఖ దుంప నాశనం అవుతుందని టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్ధ వెంకన్న అన్నారు.
15.పోక్సో చట్టంపై అవగాహన
బాలలపై అత్యాచారాలు నివారించడానికి ఉద్దేశించిన పొక్సో చట్టంపై పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కలిగిస్తామని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
16.పవన్ పై పేర్ని నాని విమర్శలు

పార్లమెంటు నియోజకవర్గం లోని ఒక అసెంబ్లీ స్థానంలో మాత్రమే తన అభ్యర్థులను నిలబెట్టి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతారని మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశ్నించారు.
17.రఘురామరాజు విమర్శలు
జగన్మోహన్ రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజలకు రాసిన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు .మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారు రాజ్యాంగ పదవుల్లో కొనసాగడానికి వీలులేదు. సీఎంపై ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలను నిగ్గు తేల్చాలని వైసిపి సభ్యునిగా డిమాండ్ చేస్తున్నానంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
18.నెలాఖరు వరకు ఎండ తీవ్రత

ఏపీలో ఈ నెల ఆఖరి వరకు ఎండ తీవ్రతతో పాటు, పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని విపత్తుల నివారణ సంస్థ హెచ్చరించింది.
19.త్వరలో విశాఖ నుంచి పాలన
త్వరలోనే విశాఖ కు పాలనా ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి అన్నారు.
20.పాఠశాలల్లో అంతర్జాతీయ సిలబస్

అంతర్జాతీయ స్థాయిలో పాఠశాల విద్య విధానాలు ఉండాలని ఏపీ సీఎం జగన్ అన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంతర్జాతీయ సిలబస్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుందని జగన్ అన్నారు.
21.నేటి నుంచి రూ.300 టిక్కెట్ల ఆర్టీసీ కోటా పెంపు
ప్రయాణికుల సౌకర్యార్థం జారీ చేసే రూ.300 టికెట్ల కోటాను టీటీడీ పెంచింది.ఆన్లైన్ లో ప్రయాణంతో పాటు శ్రీవారి 300 టిక్కెట్లను నెలరోజులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడి కోటేశ్వరరావు తెలిపారు.