తెలుగు ప్రేక్షకులకు నిధి అగర్వాల్( Nidhi Agarwal ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముద్దుగుమ్మ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇకపోతే ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది నిధి అగర్వాల్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె కెరియర్ విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలు అలాగే కెరియర్ స్టార్టింగ్ లో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ.మున్నా మైకేల్( Munna Michael ) సినిమాతో సినీ పరిశ్రమలో నా కెరీర్ మొదలైంది.
ఇదొక బాలీవుడ్ చిత్రం.టైగర్ ష్రాఫ్( Tiger Shroff ) కథానాయకుడిగా నటించారు.
ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్ నాతో ఒక కాంట్రాక్ట్ పై సంతకం చేయించుకుంది.సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధి విధానాలు ఆ కాంట్రాక్ట్ లో పొందుపరిచి ఉన్నాయి.
అందులోనే నో డేటింగ్ అనే షరతు పెట్టారు.

సినిమా పూర్తయ్యే వరకూ హీరోతో నేను డేట్ చేయకూడదని దాని సారాంశం.కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా ఇవన్నీ చదవలేదు.ఆ తర్వాతే నాక్కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను.
నటీనటులు ప్రేమలో పడితే వర్క్ పై దృష్టి పెట్టరని ఆ టీమ్ భావించి ఉండవచ్చు.అందుకే ఇలాంటి షరతులు పెట్టి ఉంటుందనుకున్నాను అని నిధి అగర్వాల్ తెలిపారు.
ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.