వేణు స్వామి (Venu Swamy)పరిచయం అవసరం లేని పేరు .ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
అయితే మొదట్లో ఈయన చెప్పిన జాతకాలు కొంతవరకు నిజం కావడంతో ఈయననే నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది.అంతేకాకుండా ఫినిసెలెబ్రిటీలు వారి సక్సెస్ కోసం ఈయనతో ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకుంటూ వార్తల్లో నిలిచారు.
ఇలా గతంలో సినీ సెలబ్రిటీలను ఉద్దేశించి వేణు స్వామి చేసే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి.

ఇలా వేణు స్వామి సెలబ్రిటీల గురించి తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.ఇక ఈయనపై సందర్భాలలో కేసులు కూడా నమోదు అయ్యాయి.అయినప్పటికీ వేణు స్వామి తీరు మాత్రం మారలేదని చెప్పాలి.
తాజాగా వేణు స్వామికి సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో భాగంగా ఈయన ఒక హీరో ఇద్దరు హీరోలు సూసైడ్ చేసుకోబోతారు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి.

ఈ ఆడియోలో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత(Samantha) సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.అదేవిధంగా ప్రభాస్ (Prabhas)విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకొనే అవకాశాలు ఉన్నాయని ఈయన తెలిపారు.ఇక వేణు స్వామి లెక్క ప్రకారమైతే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారంటూ ఆడియోలో మాట్లాడారు.అన్ని ముందు ముందు తెలుస్తాయని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పినట్టుగా ఆడియోలో రికార్డు అయ్యింది.
ఇక ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ.ప్రభాస్ కు శరీరమంతా గాయాలే ఉన్నాయని, ఆయన ఎవ్వరికీ చెప్పడం లేదన్నారు.
అందుకే రాజాసాబ్ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.