టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకోగా అఖండ2 సినిమాతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం పక్కా అని చెప్పవచ్చు.ఈ సినిమా సెప్టెంబర్ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
అయితే సెప్టెంబర్ నెల బాలయ్యకు అచ్చొచ్చిన నెల కావడం గమనార్హం.బాలయ్య గత సినిమాల మ్యాజిక్ ను ఈ సినిమాతో సైతం రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య నటించిన మంగమ్మ గారి మనవడు,
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, క్రిష్ణబాబు, చెన్నకేశవరెడ్డి, పైసా వసూల్
(Sri Tirupati Venkateswara Kalyanam, Krishna Babu, Chennakesava Reddy, Paisa Vasool)సినిమాలు సెప్టెంబర్ లో విడుదలయ్యాయి.ఈ సినిమాలలో పైసా వసూల్ మినహా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం గమనార్హం.అఖండ2 సినిమా సైతం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

బాలయ్య అఖండ2 సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.అటు బాలయ్యకు, ఇటు బోయపాటి శ్రీనుకు(Boyapati Srinu) ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ స్థాయిలో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.బాలయ్య (Balayya)పాన్ ఇండియా స్థాయిలో అఖండ2(akhanda2) సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

బాలయ్య సంయుక్త మీనన్ (Balayya, Samyukta Menon)జోడీ సూపర్ గా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.అఖండ2 సినిమాలో సైతం యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారని సమాచారం అందుతోంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.