పంజాబ్ కింగ్స్(Punjab Kings) హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఒక ఆశ్చర్యపరిచే పని చేశారు.తాజాగా ఆయన హిందూ సంప్రదాయంలో ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో తమ టీమ్ బాగా రాణించాలని పూజలు చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది.భారతీయుడిలాగా రికీ పాంటింగ్ శ్రద్ధగా పూజలు చేయడం చూసి చాలామంది నవ్వుకుంటున్నారు
కొండరు ఇండియన్ ఫ్యాన్స్ రికీ పాంటింగ్ మన సంప్రదాయాల్ని గౌరవిస్తున్నారని మెచ్చుకుంటున్నారు, పాక్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఆడుకుంటున్నారు.పాంటింగ్ డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నాడని కామెంట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు.“డబ్బుంటే ఏదైనా దిగొస్తుంది.పూజలు కూడా చేస్తాడనుకోలేదు” అంటూ ఒక పాకిస్తానీ యూజర్ X (ట్విట్టర్)లో సెటైర్ వేశాడు.“డబ్బు మనిషిని ఏదైనా చేయిస్తుంది భయ్యా” అని ఇంకొకరు కామెంట్ పెట్టాడు.ఐపీఎల్‌లో(IPL) కాసులు బాగా వెనకేసుకోవడానికే పాంటింగ్ హిందూ దేవుళ్లని (Hindu gods)పూజిస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు.పాంటింగ్ చేసిన ఈ పూజలు పంజాబ్ కింగ్స్ టీమ్ దశ తిప్పుతాయా? పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా కొట్టలేదు.అందుకే ఈ సీజన్ వాళ్లకి చావో రేవో లాంటిది.
రికీ పాంటింగ్ (Ricky Ponting)లాంటి బిగ్ షాట్ కోచ్‌గా, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా(Shreyas Iyer as captain) ఉండటంతో ఈసారైనా పంజాబ్‌కి ఫస్ట్ టైటిల్ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.రికార్డులు బ్రేక్ చేసిన ప్లేయర్‌గా, కోచ్‌గా పాంటింగ్‌కి ఇండియాలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ టీమ్‌కి బాగా పనికొస్తుంది.పంజాబ్ కింగ్స్ కొత్త స్కెచ్‌లతో, దుమ్మురేపే ప్లేయర్లతో ఈసారి మాత్రం గట్టిగా కొట్టాలని చూస్తోంది.
ఇది పక్కన పెడితే.ఐపీఎల్ 2025 రేపటి (మార్చి 22) నుంచే ప్రారంభం కానుంది.పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఏప్రిల్ 11 నుంచి షురూ అవుతుంది.రెండు లీగ్‌లు ఒకే టైమ్‌లో ఉండటంతో, ఏది చూడాలో తెలీక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతారు.
ఐపీఎల్‌కి వరల్డ్ వైడ్‌గా క్రేజ్ ఉండటంతో పీఎస్‌ఎల్‌ని పట్టించుకునే నాథుడే ఉండడు అంటున్నారు.పంజాబ్ కింగ్స్ మాత్రం ఈసారి ఎలాగైనా కొట్టాలనే కసితో ఉంది.మరి పాంటింగ్ చేసిన పూజలు దేవుడి కరుణను కురిపిస్తాయా లేక ఇది జస్ట్ ఒక మూఢ నమ్మకంగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.