తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ శ్యామల ( Anchor Shyamala )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్యామల ప్రస్తుతం యాంకరింగ్ కి దూరంగా ఉంటూ రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.

 Anchor Shyamala Approaches Telangana High Court In Betting App Case, Anchor Shya-TeluguStop.com

ఒకప్పుడు తన యాంకరింగ్ తో ఎన్నో షోలు చేసి యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్యామల ప్రస్తుతం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఇటీవలకాలంలో టీడీపీపై అలాగే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై సంచలన వ్యాఖ్యలు చేసి ఎక్కువగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Telugu Anchor Shyamala, Anchorshyamala, App, Telangana, Tollywood-Movie

ఇది ఇలా అంటే గత మూడు రోజులుగా శ్యామల పేరు మరోసారి సోషల్ మీడియాలో( social media ) వైరల్ గా మారింది.ఏమిటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిలో యాంకర్ శ్యామల పేరు కూడా వినిపించడంతో అమెను శిక్షించాలని, కేసు నమోదు చేయాలి అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వెల్లువెత్తాయి.ఇది ఇలా ఉంటే ఇదే విషయంపై తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టును తెలుస్తోంది.మరి ఆ వివరాల్లోలకీ వెళితే.తెలంగాణ హైకోర్టును యాంకర్‌ శ్యామల ఆశ్రయించారు.బెట్టింగ్ యాప్‌ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారట.

Telugu Anchor Shyamala, Anchorshyamala, App, Telangana, Tollywood-Movie

అయితే దీనిపై నేడు కోర్టులో విచారణ జరగనుందట.బెట్టింగ్ యాప్స్‌ను( Betting apps ) ప్రమోట్ చేసినందుకు పంజా గుట్ట పోలీస్ స్టేషన్‌ లో శ్యామలపై కేసు నమోదైన విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ లకు ప్రచారం చేసిన కేసులో టీవీ యాంకర్‌ విష్ణు ప్రియ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు నిన్న సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.అయితే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామలకు తీర్పు ఏ విధంగా వస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube