ఒక్కోసారి అనుకోకుండా జరిగే చిన్న విషయాలు కూడా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ (Create a sensation on the Internet)చేస్తాయి. బెంగళూరులోని గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ (Global Academy of Technology College, Bangalore)లెక్చరర్ ఒకరు తన స్టూడెంట్స్‌కి సడెన్‌గా డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చారు.
ఊహించని విధంగా ఫుల్ ఎనర్జీతో, ఉత్సాహంతో ఊగిపోయిన ఆ లెక్చరర్ స్టూడెంట్స్‌నే కాదు, చూసిన వాళ్లందర్నీ ఫిదా చేశారు.
ఆ వీడియోలో లెక్చరర్ కాలేజీ ఆవరణలోనే స్టూడెంట్స్ ముందే దుమ్ములేపే స్టెప్పులతో అదరగొట్టారు.
క్లాస్‌లో బోర్‌గా అనిపించకుండా ఫన్ కోసం స్టార్ట్ చేసిన ఈ డ్యాన్స్ ఒక్కసారిగా సూపర్ మూమెంట్ అయిపోయింది.ఆయన వేసిన స్టెప్పులు, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌కి స్టూడెంట్స్(Students for Expressions) పడిపోయారు.
టీచర్‌లో ఇంత టాలెంట్ ఉందా అని స్టూడెంట్స్ షాక్ అయ్యారు.వాళ్లంతా కేరింతలు కొడుతూ ఎంకరేజ్ చేశారు.
వాళ్ల రెస్పాన్స్ వీడియోకి మరింత అందం తెచ్చింది.
అంతే, ఆ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది.ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో (Instagram)చూసిన నెటిజన్లు లెక్చరర్‌ని పొగడ్తలతో ముంచెత్తారు.ఆయన ఫ్రీ స్పిరిట్‌కి ఫిదా అయిపోయారు.
వీడియోకి వేలల్లో లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయి.మామూలుగా టీచర్లు అంటే సీరియస్‌గా ఉంటారు అనుకుంటాం.
కానీ ఈ లెక్చరర్ మాత్రం స్టూడెంట్స్‌తో కలిసిపోయి చేసిన డ్యాన్స్‌కి అందరూ ఇంప్రెస్ అయ్యారు.గురు-శిష్యుల మధ్య బౌండరీని చెరిపేస్తూ, ఎంతో సరదాగా చేసిన ఈ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.
టీచర్లు కూడా ఇలా ఫన్ చేయొచ్చా అని చాలా మంది ఆశ్చర్యపోయారు.చదువుకునే క్లాస్‌రూంలో కూడా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అంటున్నారు.లెక్చరర్ వేసిన స్టెప్పులు చాలా మంది మొహాల్లో నవ్వులు పూయించాయి.ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది.నెటిజన్లు లెక్చరర్ పాజిటివిటీని చూసి అభినందిస్తున్నారు.ఆయన వేసిన ఒక్క డ్యాన్స్‌తో ఎంతో మందికి ఆనందం పంచారు.
చిన్న చిన్న సంతోషాల్లోనే నిజమైన ఆనందం దాగుంది అని ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది.