టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు( Star heroine Samantha ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఫ్యాన్స్ ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ సామ్ ఎమోషనల్ అయ్యారు.చెన్నైలో( Chennai ) జరిగిన ఒక వేడుకలో ఆమె ఈ కామెంట్లు చేశారు.
సమంతకు తాజాగా కె.బాలచందర్ హాఫ్ ఫేమ్ అవార్డ్ ( K.Balachander Half Fame Award )దక్కగా అవార్డ్ అనంతరం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ అవార్డ్ అందుకోవడం నాకు సంతోషంగా ఉందని సమంత తెలిపారు.
బాలచందర్ సార్ పేరుతో అవార్డ్ అందుకోవడం ఎంతో ప్రత్యేకం అని ఆమె వెల్లడించారు.బాలచందర్ గారు ఎన్నో అద్భుతమైన పాత్రలను మనకు పరిచయం చేశారని సమంత చెప్పుకొచ్చారు.

బాలచందర్ గారి సినిమాల్లో స్త్రీ పాత్రలు సహజంగా ఉంటాయని ఆయన సినిమాల నుంచి నేను స్పూర్తి పొందానని సామ్ కామెంట్లు చేశారు.ఈరోజు నా జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తుందని సమంత చెప్పుకొచ్చారు.ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన వాళ్లకు ధన్యవాదాలు అని సామ్ తెలిపారు.ఒక సినిమా హిట్టైతే మనల్ని ప్రేమించే వాళ్లు ఉంటారని సమంత కామెంట్లు చేశారు.

నేను తమిళ సినిమా చేయక రెండేళ్లు అయిందని ఈ మధ్య కాలంలో హిట్ అందుకోలేదని అయినా నాపై మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని సమంత పేర్కొన్నారు.మీ ప్రేమ చూస్తుంటే నాకు మాటలు రావడం లేదని సామ్ పేర్కొన్నారు.మీరు లేకుండా నేను లేనని ఇంత ప్రేమ పొందడానికి నేనేం చేశానో కూడా నాకు తెలియదని సమంత వెల్లడించడం గమనార్హం.సమంత వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.