ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏడాది మొత్తం రైలు ప్రయాణం.. ఈ ట్రిక్ తెలిస్తే మీరు షాకవుతారు!

బ్రిటన్‌లో (Britain)ఓ తెలివైన ప్రయాణికుడు రూపాయి ఖర్చు లేకుండా ఏడాది మొత్తం రైలులో తిరిగేశాడు.రైల్వే సంస్థల రిఫండ్ పాలసీలను తెలివిగా వాడుకుని మరీ ఈ పని చేశాడు.

 Travel By Train For A Whole Year Without Spending A Single Rupee.. You Will Be S-TeluguStop.com

రైలు వేళలు, ఆలస్యాల గురించి ముందే పసిగట్టి, ప్రతి టికెట్‌కూ డబ్బులు వెనక్కి తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే, ఎడ్ వైజ్ (Ed Wise)అనే 29 ఏళ్ల కుర్రాడు, పర్సనల్ ఫైనాన్స్ న్యూస్‌లెటర్ రాస్తూ ఉంటాడు.అతను మూడేళ్లలో అవంతి వెస్ట్ కోస్ట్ రైళ్లలో (Avanti West Coast trains)ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఏకంగా రూ.1,06,000 పైనే ఆదా చేశాడు.2023లో ఒక్క రూపాయి పెట్టకుండానే ప్రతీ జర్నీకి రిఫండ్ కొట్టేశాడు.వైజ్ సీక్రెట్ ఏంటంటే.

రైళ్లు ఎప్పుడెప్పుడు లేట్ అవుతాయో కనిపెట్టడం, దాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవడం.

అవంతి వెస్ట్ కోస్ట్ (Avanti West Coast)సంస్థ.

రైళ్లు ఆలస్యమైతే ప్రయాణికులకు డబ్బులు వెనక్కి ఇస్తుంది.ఎంత ఆలస్యమైతే ఎంత రిఫండో చూస్తే 15 నిమిషాలు లేట్ అయితే 25% రిఫండ్, 30 నిమిషాలు లేట్ అయితే 50% రిఫండ్, గంట లేదా అంతకంటే ఎక్కువ లేట్ అయితే 100% రిఫండ్ ఇస్తుంది.

వైజ్ ప్రయాణాలు ప్లాన్ చేసుకునేటప్పుడే రైలు గంట కంటే ఎక్కువే లేట్ అయ్యేలా చూసుకున్నాడు.వైజ్‌కి ఈ ఆలోచన రావడానికి కారణం ఒక బాధాకరమైన అనుభవం.

ఇటలీ (Italy)వెళ్లినప్పుడు అక్కడ రైళ్లు ఎంత బాగున్నాయో చూసి షాక్ అయ్యాడు.తక్కువ ధరలు, టైమ్‌కి రావడం కూడా ఫిదా చేశాయి.

అదే యూకే రైళ్లు చూస్తే రేట్లు ఎక్కువ, ఆలస్యం కావడం జరిగేది.రైలు పాసులు, టికెట్ స్ప్లిటింగ్, దగ్గర్లోని స్టేషన్లకు(Rail passes, ticket splitting, to nearby stations) వెళ్లడం.

ఇలా ఎన్ని ట్రిక్కులు వాడినా రేట్లు మాత్రం తగ్గలేదు.ఇంకా ఈ రైళ్ల ఆలస్యాలు చూసి విసిగిపోయి, ఫ్రీగా ఎలా తిరగాలో ఆలోచించాడు.

అలా పుట్టిందే ఈ రిఫండ్ ట్రిక్.

Telugu Avanti Refunds, Cheap Uk Rail, Ed Wise Train, Train Travel, Rail Travel,

వైజ్ ఆలస్యాలు వస్తాయని ముందే చెప్పడానికి మూడు ట్రిక్కులు వాడేవాడు.మొదటిది స్ట్రైక్స్, కార్మిక సంఘాలు సమ్మెలు చేస్తే రెండు వారాల ముందు చెప్పాలి.వైజ్ దీన్ని ముందే పసిగట్టేవాడు.

సమ్మెకు ముందు, సమ్మె తర్వాత ప్రయాణాలు బుక్ చేసుకునేవాడు.ఎందుకంటే ఆ టైమ్‌లో రైళ్లు లేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.

అలాగే రైల్వే ట్రాక్‌ల మరమ్మత్తులు చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా రైళ్లు లేట్ అవుతాయి.వైజ్ ఆ టైమ్‌లో జర్నీలు ప్లాన్ చేసేవాడు.

మంచు, భారీ వర్షాలు, తుఫానులు వస్తే రైళ్లు ఆగిపోతాయి లేదా లేట్ అవుతాయి.వైజ్ వాతావరణం రిపోర్ట్స్ చూసి, ఆ టైమ్‌లో టికెట్లు బుక్ చేసుకునేవాడు.

ఈ మూడు ట్రిక్కులు వాడి వైజ్ రైలు ప్రయాణాన్ని పూర్తిగా ఫ్రీగా మార్చేశాడు.డబ్బులు ఆదా చేసుకోవడం అంటే ఇదే మరి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube