అదరగొడుతున్న అఖండ.. ఈ ఏడాది ఓవర్సీస్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఏంటో తెలుసా?

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమాకు ఓవర్సీస్ అనేది చాలా కీలకంగా ఉండేది.ఒక్కో సినిమా ఓవర్సీస్ లో 20 కోట్లకు పైగా సంపాదించిన సినిమాలు కూడా ఉన్నాయి.

 Tollywood Overseas Collections Till 2021, Tollywood , Akhanda, Love Story, Most-TeluguStop.com

కానీ ఇప్పుడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.కరోనా దెబ్బకు జనాలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు.

దీంతో పాటు ఓటీటీలు కూడా బాగా పెరిగాయి.దీంతో జనాలు ఇళ్లలో ఉండే సినిమాలు చూస్తున్నారు.దీంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయింది.అయితే తాజాగా బాలయ్య నటించిన అఖండి సినిమా ఓవర్సీస్ లో దుమ్మురేపుతుంది.మూడు రోజుల్లోనే భారీగా డబ్బు వసూళు చేసింది.అయితే ఈ ఏడాది అమెరికాలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 సినిమాలేంటో ఇప్పుడు తెలుకుందాం.

*అఖండ

బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన తాజా మూవీ అఖండ.4 రోజుల్లో ఓవర్సీస్ లో భారీగా వసూళ్లు సాధించింది.మూడు రోజుల్లోనే $729,301 సాధించి.మిలియన్ డాలర్స్ వైపు అడుగులు వేస్తుంది.

*లవ్ స్టోరీ

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా అమెరికాలో $1,258,045 వసూలు చేసింది.

Telugu Akhanda, Jathiratnalu, Love Story, Tollywood, Vakeel Saab-Telugu Stop Exc

*జాతి రత్నాలు

కరోనా తర్వాత చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టింది ఈ సినిమా.కరోనా అనంతరం ఓవర్సీస్ లో మిలియన్ దాటిని ఫస్ట్ మూవీగా నిలిచింది.ఈ సినిమా మొత్తంగా $1,057,538 కలెక్షన్స్ సాధించింది.

*వకీల్ సాబ్

పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు ఓవర్సీస్ లో భారీగా కలెక్షన్స్ సాధిస్తాయి.మిలియన్స్ కొద్ది డాలర్స్ వసూలు అవుతాయి.కానీ ఈ సినిమా కేవలం $743,073తోనే సరిపెట్టుకుంది.

Telugu Akhanda, Jathiratnalu, Love Story, Tollywood, Vakeel Saab-Telugu Stop Exc

*మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా చేశారు.ఈ సినిమా ఓవరాల్ గా 23 కోట్లు సాధించింది.ఓవర్సీస్ లో మాత్రం $536,110 వసూలు చేసి సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube