తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి చాలామంది స్టార్ హీరోలు(Star heroes) మాత్రమే గుర్తుకొస్తారు.నిజానికి సినిమా అంటే హీరోలు మాత్రమే కాదు.24 క్యారెట్స్ అన్ని కలిస్తేనే ఒక సినిమా అనేది బయటకు వస్తుంది.అయినప్పటికి ప్రేక్షకులు మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న హీరోలను ఎక్కువగా చూస్తూ వాళ్లకే పట్టం కడుతూ ఉంటారు.
ఇక ఇలాంటి సందర్భంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరోలు సైతం స్టార్ హీరోలుగా మారుతున్నారు.ఇక దర్శకులు సైతం ఆయన హీరోలను స్టార్లుగా మార్చడంలో కీలకపాత్ర వహిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా దర్శకులతో పోలిస్తే హీరోలకు మాత్రమే ఇక్కడ ఎక్కువ గుర్తింపు ఉంటుంది అనేది వాస్తవం. రాజమౌళి తీసిన ‘త్రిబుల్ ఆర్’(Rajamouli’s RRR) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి కంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్(Jr.
NTR, Ram Charan) కి ఎక్కువ క్రేజ్ అయితే వచ్చింది.మరి రాజమౌళి లేకపోతే ఆ సినిమా లేదు ఆయన సృజనాత్మకతకు పట్టం కడుతూ ఈ సినిమాని తెరకెక్కించారు.
అయినప్పటికి రాజమౌళి కంటే కూడా హీరోలకే ఎక్కువగా గుర్తింపు వచ్చింది.ఒక సినిమా సక్సెస్ అయిందంటే దర్శకులను పక్కనపెట్టి హీరోలను మాత్రమే పొగుడుతూ ఉంటారు.అలాగే ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరోలను పక్కనపెట్టి దర్శకులు తిడుతూ ఉంటారు.

మరి ఏది ఏమైనా కూడా హీరోలు సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు.ఎటు తిరిగి దర్శకులు మాత్రమే డేంజర్ జోన్ (Danger Zone)లోకి వెళ్ళిపోతున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపైతే వస్తుంది…చూడాలి మరి ఇకమీదట అయిన దర్శకులకు మంచి గుర్తింపు వస్తుందా లేదా అనేది…
.