సినీ నటి శోభిత (Sobhita)ఇటీవల నాగచైతన్య (Nagachaitanya)వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా నాగచైతన్య విషయంలో గతంలో సమంత(Samantha) ఏ విధంగా అయితే వ్యవహరించేవారో సమంత కూడా అదే విధంగా వ్యవహరించడంతో గతంలో ఈమె గురించి భారీగానే విమర్శలు వచ్చాయి.
ఇలా సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత శోభిత నాగచైతన్య ప్రేమలో పడటం ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవటం జరిగింది.అయితే పెళ్లి కార్యక్రమాల నుంచి మొదలుకొని ఇప్పటివరకు శోభిత సమంతనే ఫాలో అవుతున్నారని సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇకపోతే తాజాగా మరోసారి శోభిత భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.ఇటీవలే నాగ చైతన్య, శోభిత ప్రముఖ మ్యాగిజైన్ “వోగ్” కవర్ ఫొటోస్ కి ఫోజులిచ్చారు.ఇందులో నాగచైతన్య, శోభిత మంచి స్టైలిష్ దుస్తులలో కనిపించారు.ఇక ఈ ఫోటోషూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో శోభిత ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
ఇందులో భాగంగా అచ్చం ఈమె సమంత వేసినటువంటి డ్రెస్(Dress) వేయటంతో సమంతను చూసి ఆమె డ్రెస్ డిజైన్స్ కాపీ కొట్టారు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

శోభిత అఖ్ల్ బ్రాండ్ కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది.దీని ధర దాదాపుగా రూ.49,593 పైగా ఉంది.అయితే ఓ నెటిజన్ ఈ ఫోటోలపై స్పందిస్తూ శోభిత గతంలో సమంత ధరించిన దుస్తులను ధరించి కాపీ కొట్టిందని కామెంట్ చేశాడు.గతంలో నాగ చైతన్య మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంత ఓంబ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ ని ధరించి ఫోటోలై ఫోజులిచ్చింది.
దీంతో వీరిద్దరూ ధరించిన దుస్తులు కాస్త ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో నేటిజన్స్ శోభితపై విమర్శలు కురిపిస్తున్నారు.