నల్ల మచ్చలు. ఎందరినో వేధించే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.
మొటిమలు, వయసు పైబడటం, హార్మోన్ ఛేంజస్, పోషకాల కొరత, కాలుష్యం, స్కిన్ కేర్ లేకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి.ఇవి ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీయడమే కాదు.
మనలోని ఆత్మవిశ్వాసాన్ని సైతం తగ్గించేస్తాయి.అందుకు ఈ నల్ల మచ్చలను వదిలించుకునేందుకు ఎన్నెన్నో ఖరీదైన క్రీములను వాడుతుంటారు.
కొందరైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరమ్‌ను వాడితే గనుక కేవలం వారం రోజుల్లోనే మీ ముఖంపై ఏర్పిడిన నల్ల మచ్చలు తగ్గడం ప్రారంభం అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి వాటర్‌లో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
ఈ తురుము నుంచి జ్యూస్‌ను మాత్రం వేరు చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో బంగాళదుంప రసాన్ని వేసి ఒకటి లేదా రెండు నిమషాల పాటు మరిగించి చల్లారబెట్టుకోవాలి.

ఆ తర్వాత చిన్న బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల విటమిన్ ఇ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ప్యూర్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ చేసి ఒకసారి కలుపుకోవాలి.చివరిగా ఇందులో కాచి చల్లార్చిన బంగాళదుంప రసం మూడు టేబుల్ స్పూన్లు వేసి అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకుంటే సీరమ్ సిద్ధమైనట్లే.

దీనిని చిన్న బాటిల్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే దాదాపు పది రోజులు వాడుకోవచ్చు.ఇక ఈ సీరమ్‌ను నైట్ నిద్రించే ముందు మరియు స్నానం చేయడానికి గంట ముందు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే గనుక నల్ల మచ్చలు తగ్గిపోయి మీ ముఖం అందంగా, యవ్వనంగా మారుతుంది.